
ట్యాగ్ · 4 కథనాలు


విజయ్ దేవరకొండ "వర్క్ ఫ్రమ్ హోమ్ "

200 కోట్లు చాలా తక్కువ అంటున్న 'లైగర్'

'లైగర్' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్

పునీత్ రాజ్ కుమార్ కు లైగర్ నివాళులు
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. విజయ్ దేవరకొండ నుండి సినిమా వచ్చి చాలా రోజులు అవుతుండటంతో తమ హీరో సినిమాను ఎప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా పూరీ లాంటి డైరెక్టర్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండటం.. విజయ్ దేవరకొండ హీరో అవ్వడంతో ఆ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ఆగష్ట్ 25న ఈసినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.

విజయ్ దేవరకొండ "వర్క్ ఫ్రమ్ హోమ్ "
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్‌బ్రీడ్ క్యాప్షన్ తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్“మూవీ సెప్టెంబర్ 9వ తేదీ రిలీజ్ కానుంది.హీరో విజయ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు. రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు. కిక్ బాక్సర్ గా కనిపించడానికి విజయ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నారు. భారీ వర్కవుట్స్ చేసి సిక్స్ ప్యాక్ బాడీతో కంప్లీట్ మేకోవర్ అయ్యారు.

200 కోట్లు చాలా తక్కువ అంటున్న 'లైగర్'
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది. ఇప్పటికే ముంబైలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడం.. షూటింగ్ లకు అనుమతి ఇస్తుండటంతో పూరీ జగన్నాథ్ 'లైగర్' తదుపరి షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

'లైగర్' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్
పూరీ జగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న లైగర్ మూవీకి మరోసారి బ్రేక్ పడింది. ఈసినిమా షూటింగ్ కు గత ఏడాది కరోనా వల్ల ప్యాకప్ చెప్పి ఇక్కడికి రావాల్సి వచ్చింది. రీసెంట్ గానే మళ్లీ షూటింగ్ కోసం ముంబై వెళ్లారు. ముంబైలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో వెళ్లిన కొద్దిరోజులకే మళ్లీ ఇక్కడికి వచ్చేశారు.