
ట్యాగ్ · 125 కథనాలు · పేజీ 7


అమిగోస్ టీజర్ రిలీజ్

వాల్తేరు వీరయ్య ట్రైలర్ రిలీజ్

వీరసింహారెడ్డి ట్రైలర్ రిలీజ్

ఫిబ్రవరి 17 వ తేదీ 4 సినిమాల సందడి

శాకుంతలం ట్రైలర్ రిలీజ్
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో, విజయాలతో దూసుకుపోతుంది. ఇటీవలే యశోద సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో మైథలాజికల్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. మహాభారతంలో దుశ్యంతుడు, శకుంతల ప్రేమ కథని ఈసినిమా ద్వారా చూపించబోతున్నారు. ఇక ఇలాంటి సినిమాలు తీయడంలో గుణశేఖర్ కి మంచి అనుభవం ఉంది కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక దాదాపు మూడేళ్లు ఈసినిమా కోసం కష్టపడ్డారు. ఇక ఫైనల్ గా ఫిబ్రవరి17వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు…

అమిగోస్ టీజర్ రిలీజ్
కళ్యాణ్ రామ్ మొత్తానికి విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా మల్లిడ విశిష్టతో బింబిసార అనే పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న సినిమా అమిగోస్. ఇక బింబిసార సినిమాలో రెండు పాత్రలతో అలరించాడు కళ్యాణ్ రామ్. ఇక ఇప్పుడు ఈసినిమాలో ఏకంగా మూడు పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అందులో ఒక పాత్ర నెగెటివ్ షేడ్ లో రెండు పాత్రలు కాస్త విభిన్నంగా ఉండేలా కనిపిస్తున్నాయి. కేవలం ఫస్ట్ లుక్స్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్.

వాల్తేరు వీరయ్య ట్రైలర్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమానుంచి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ వచ్చేసింది. బాబీ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే భారీ స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు విడుదలవగా.. అన్నీ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

వీరసింహారెడ్డి ట్రైలర్ రిలీజ్
మొత్తానికి నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టైమ్ కు బ్రేక్ పడింది. మాస్ సినిమాలు తీయడంలో ఎక్పర్ట్ అయిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా వీరసింహారెడ్డి. గోపీచంద్ క్రాక్ లాంటి సూపర్ హిట్ తర్వాత.. బాలకృష్ణ అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుండి ప్రతి అప్ డేట్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. బాలయ్య స్టిల్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పాటల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రిలీజ్ అయిన ప్రతి పాట కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం…

ఫిబ్రవరి 17 వ తేదీ 4 సినిమాల సందడి
2023 సంక్రాంతి పండగ కి పలు సినిమాల సందడి ఉన్నట్టే ఫిబ్రవరి 17 వ తేదీ 4 సినిమాలు సందడి చేయనున్నాయి.