
ట్యాగ్ · 5 కథనాలు


సూపర్ హిట్ మూవీ రీమేక్ లో నయనతార ?

"అన్నాత్తే "మూవీ సెట్స్ లో నయనతార
"లూసిఫర్"రీమేక్ లో నయనతార ?
సిస్టర్ నయనతార నీకు హ్యాపీ బర్త్ డే

అన్నాత్తే షూటింగ్ కు లేడీ సూపర్ స్టార్
కరోనా సెకండ్ వేవ్ తో మళ్లీ సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడుతుంది. ఈనేపథ్యంలో అన్నాత్తే సినిమాకు కూడా బ్రేక్ పడిందన్న వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం రాత్రిపూట కర్ప్యూ విధించడంతో షూటింగ్ కు బ్రేక్ పడిందన్నారు. అయితే వాటిలో ఎలాంటి నిజం లేదని.. అవి ఒట్టి పుకార్లే అని చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. తమ సినిమాను అనుకున్నట్లే దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఇక ఆవార్తలను నిజం చేస్తూ ఈసినిమాలో నటిస్తున్న లేడీ సూపర్ స్టార్ కూడా హైద్రబాద్ లో వాలిపోయింది. నేడు అన్నాత్తే…

సూపర్ హిట్ మూవీ రీమేక్ లో నయనతార ?
క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె అజయ్ కుమార్ దర్శకత్వంలో మాధవి ప్రధాన పాత్రలో రూపొందిన "మాతృదేవోభవ"మూవీ 1991 సంవత్సరం లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుని కల్ట్ క్లాసిక్ మూవీ గా నిలిచింది. ఈ మూవీ బెస్ట్ మూవీ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది. కీరవాణి స్వరకల్పనలో వేటూరి రచన , కీరవాణి గానం చేసిన "రాలిపోయే పువ్వా " సాంగ్ విశేష ప్రేక్షకాదరణ పొందింది . బెస్ట్ లిరిసిస్ట్ గా వేటూరి నేషనల్ అవార్డ్ అందుకున్నారు.

"అన్నాత్తే "మూవీ సెట్స్ లో నయనతార
సన్ పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ "అన్నాత్తే "తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార , జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ కథానాయికలు కాగా సీనియర్ హీరోయిన్స్ మీనా , ఖుష్బూ , ప్రకాష్ రాజ్ , జగపతి బాబు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.
"లూసిఫర్"రీమేక్ లో నయనతార ?
సూపర్ స్టార్ మోహన్ లాల్ , మంజు వారియర్ ప్రధానపాత్రలలో, పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్ “లూసిఫర్” మలయాళ మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో మంజు వారియర్ ఒక గ్రేట్ పొలిటీషియన్ కుమార్తె గా , బాధ్యత గల మహిళగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు.ఆమె కు సపోర్ట్ గా నిలిచిన మోహన్ లాల్ తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “లూసిఫర్” మలయాళ మూవీ తెలుగు రీమేక్ మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనుంది. మలయాళ మూవీ లో నటించిన మంజు వారియర్ పాత్రకు నయనతార ను సెలెక్ట్ చేసినట్టు సమాచారం.
సిస్టర్ నయనతార నీకు హ్యాపీ బర్త్ డే
లేడీ సూపర్ స్టార్ నయన తార పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా నయన్ కు అభిమానులతో పాటు పలువురు సినీ సీలెబ్రిటీస్ కూడా సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసారు. ఇక ఈనేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా తనట్విట్టర్ ద్వారా నయన్ కు బర్త్ డే విషెస్ తెలియచేసారు. వన్ అండ్ ఓన్లీ నయనతారకు హ్యాపీ బర్త్ డే.. నువ్వు మరింతగా వెలగాలి. మనదైన దాని కోసం పోరాడే స్ఫూర్తిని మాలాంటి వాళ్లకి కలిగించాలి. నీకు మరింత బలం చేకూరాలి. సిస్టర్.. నీ బలానికి, పట్టుదలకు సెల్యూట్’ అంటూ ట్వీట్ చేసింది.