ట్యాగ్ · 6 కథనాలు
భారీ ప్రమోషన్స్ తో "క్రాక్ "
సెన్సార్ పూర్తి చేసుకున్న 'క్రాక్'
'క్రాక్ ట్రైలర్' - నో డౌట్.. ష్యూర్ షాట్
ఫైనల్ షెడ్యూల్ కోసం 'గోవా' లో క్రాక్ టీమ్
టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న 'క్రాక్'
క్రాక్ పై 'చిరు' ప్రశంసలు
చాలా గ్యాప్ తర్వాత క్రాక్ సినిమాతో వచ్చి సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు మాస్ మహారాజా రవితేజ. మంచి టాక్ ను సొంతం చేసుకోటమే కాకుండా సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతుంది. రవితేజ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ క్రాక్ సినిమాపై ప్రశంసలు కురిపించగా.. ఇప్పుడు తండ్రి చిరు కూడా క్రాక్ సినిమాను.. డైరెక్టర్ గోపీచంద్ పై ప్రశంసలు కురిపించినట్టు తెలిపాడు.
భారీ ప్రమోషన్స్ తో "క్రాక్ "
సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 9 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ మూవీ లో తెలుగు , తమిళ భాషలలో లేడీ విలన్ గా పేరు పొందిన వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటించారు. సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.
సెన్సార్ పూర్తి చేసుకున్న 'క్రాక్'
మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మూడో చిత్రం 'క్రాక్'. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇక రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘క్రాక్’ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ వీడియోగా నిలవడమే గాక రవితేజ ఖాతాలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే 7 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోడమే కాదు 2 లక్షల మేర లైక్స్ ను సొంతం చేసుకుంది.
'క్రాక్ ట్రైలర్' - నో డౌట్.. ష్యూర్ షాట్
మొత్తానికి మాస్ మహారాజా రవితేజ అభిమానులకు న్యూ ఇయర్ కి మంచి ట్రీటే లభించింది అని చెప్పొచ్చు. రవితేజ నటిస్తున్న క్రాక్ సినిమా త్వరలో థియేటర్స్ లో రిలీజ్ కానున్న నేపథ్యంలో కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం ఆ అంచనాలను ఇంకారెట్టింపు చేసింది అని చెప్పుడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసారి రవితేజ హిట్ కొట్టడం ఖాయం.. గతంలో పాత రవితేజ కనిపించాడు మళ్లీ ఈ సినిమాతో అన్న అభిప్రాయాలు వస్తున్నాయి.
ఫైనల్ షెడ్యూల్ కోసం 'గోవా' లో క్రాక్ టీమ్
మాస్ మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న మూడో చిత్రం 'క్రాక్'. 'క్రాక్' తో హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతున్నారు వీరిద్దరు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే క్రాక్ టీం కూడా ఆఖరి షెడ్యూల్ ను మొదలుపెట్టేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో స్టార్ట్ చేయగా కొంత భాగం అక్కడ చిత్రీకరించారు. ఇక కొంతభాగం మిగిలిఉండగా ఇప్పుడు అది కంప్లీట్ చేయడానికి చిత్రయూనిట్ గోవా వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని రవితేజ తన ఇన్‌స్టా ద్వారా తెలియచేశారు. ఫైనల్ షెడ్యూల్ కోసం గోవా వెళ్తున్నట్టు పోస్ట్ లో పేర్కొన్నాడు.
టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న 'క్రాక్'
మాస్ మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న మూడో చిత్రం 'క్రాక్'. ఇటీవలే క్రాక్ టీం కూడా ఆఖరి షెడ్యూల్ ను మొదలుపెట్టేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. త్వరలో హీరో హీరోయిన్లు రవితేజ, శ్రుతి హాసన్‌పై ఓ పాటను చిత్రీకరించనున్నారట. ఆ పాటతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని చెపుతున్నారు చిత్రయూనిట్.