
ట్యాగ్ · 4 కథనాలు


దసరా ట్రీట్ - క్రాక్ నుండి రానున్న అప్ డేట్

"క్రాక్" మూవీ షూటింగ్ ప్రారంభం

1000+ స్క్రీన్స్ లో "క్రాక్ "
సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 9 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

దసరా ట్రీట్ - క్రాక్ నుండి రానున్న అప్ డేట్
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా క్రాక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ లాక్ డౌన్ ముందే ముగింపు దశకు వచ్చింది. ఇక ఇప్పుడు షూటింగ్స్ మొదలవుతున్న నేపథ్యంలో క్రాక్ టీం కూడా ఆఖరి షెడ్యూల్ ను మొదలుపెట్టేసింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో చివరి షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
పాట చిత్రీకరణలో 'క్రాక్'
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'క్రాక్'. మూడేళ్ల విరామం అనంతరం ఈ సినిమాతో అందాల తార శృతి హాసన్ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ మెరుపువేగంతో సాగుతోంది.

"క్రాక్" మూవీ షూటింగ్ ప్రారంభం
మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ "క్రాక్ "షూటింగ్ ఈ రోజు ప్రారంభమయింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ నటిస్తున్న ఈ మూవీ లో శృతి హాసన్, వరలక్ష్మి శరత్ కుమార్ కథానాయికలు. నటుడు, దర్శకుడు సముద్రఖని ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ S సంగీతం అందిస్తున్నారు.