కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Khiladi

ట్యాగ్ · 64 కథనాలు · పేజీ 4

సినిమా వార్తలు

మ్యూజిక్ సిట్టింగ్స్‌లో ర‌వితేజ 'ఖిలాడి'

రమేష్‌వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయగా... ఫస్ట్‌లుక్‌లో రవితేజ హుషారుగా కనిపిస్తూ ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

హైదరాబాద్ లో "ఖిలాడి "

సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , స్టార్ హీరోయిన్ శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. "క్రాక్ " మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. సంక్రాంతికి రిలీజ్ కానుందని సమాచారం. ఇప్పుడు రవితేజ మరో మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

రవితేజ 'ఖిలాడి' ఫస్ట్ లుక్ రిలీజ్

రమేష్‌వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను హైద్రాబాద్ లో లాంఛనంగా ప్రారంభించారు. ఇక ఈ సినిమాకు ఖిలాడి అనే టైటిల్ ను పెట్టనున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ‘ఖిలాడి’ (ప్లే స్మార్ట్‌) అనే టైటిల్ ను పెట్టారు. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్‌లుక్‌లో రవితేజ హుషారుగా కనిపిస్తుండగా, అతడిపై కరెన్సీ నోట్ల వర్షం కురుస్తుండటం ఆసక్తిని పంచుతోంది.

TFN Adminవాట్సాప్
Mass Maharaja Ravi Teja Next Titled As Khiladi,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Mass Maharaja Ravi Teja,Ravi Teja Next Movie Khiladi,Khiladi,Khiladi Movie,Khiladi Telugu Movie,Ravi Teja Khilad
సినిమా వార్తలు

`కిలాడి`గా ర‌వితేజ‌?

ఇటీవ‌లే `డిస్కో రాజా`గా సంద‌డి చేశాడు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌. ప్ర‌స్తుతం కాప్ స్టోరీ `క్రాక్`తో బిజీగా ఉన్న ఈ టాలెంటెడ్ స్టార్... మే 8న స‌ద‌రు సినిమాతో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. కాగా, ఆ లోపే మ‌రో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్నాడు ర‌వితేజ‌. `రాక్ష‌సుడు` ఫేమ్ ర‌మేష్ వ‌ర్మ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ర‌వితేజ రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపిస్తాడ‌ని స‌మాచారం. మార్చి నుండి సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ సినిమాకి `కిలాడి` అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ టైటిల్ పై మ‌రింత క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

Team TFNవాట్సాప్

షేర్