ట్యాగ్ · 4 కథనాలు

`మహానటి` తరువాత మరోసారి...
రజినీ సర్ తో సినిమా - నా కెరీర్ లో మైల్ స్టోన్
తెలుగుతో పాటు తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది కీర్తిసురేష్. ప్రస్తుతం ఈ భామ హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటిస్తోన్న ‘మైదాన్’ సినిమాలో నటిస్తోంది. దాంతో పాటు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక ఎమోషనల్ థ్రిల్లర్ సినిమాలో యాక్ట్ చేస్తోంది. వాటితో పాటు ‘మిస్ ఇండియా’ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో ముఖ్యపాత్రలు పోషిస్తోంది. ఇక తాజాగా మరో బంపర్ ఆఫర్ ను కొట్టేసింది ఈ భామ.

కీర్తి సురేష్ నెక్ట్స్ తెలుగు ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్
`మహానటి`తో కేరళ కుట్టి కీర్తి సురేష్ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఎంతలా అంటే... `మహానటి`కి ముందు, తరువాత అన్నంతగా ఆమె కెరీర్ మలుపు తీసుకుంది. ఈ నేపథ్యంలో... ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటోంది. అభినయానికి అవకాశమున్న పాత్రలు లభిస్తుండడంతో... హిందీ పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది కీర్తి.

బాలీవుడ్ ప్రాజెక్ట్ కు కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్
తెలుగు, తమిళ్ సినిమాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. గత కొద్ది రోలుజుగా కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలు నిజమే అని క్లారిటీ వచ్చేసింది.

`మహానటి` తరువాత మరోసారి...
గత ఏడాది వేసవిలో విడుదలైన `మహానటి` సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ బయోపిక్‌లో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయింది. `మహానటి` తెచ్చిన గుర్తింపుతో... తెలుగునాట సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది కీర్తి. ఎట్టకేలకు... ఇటీవల మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీకి ఈ కేరళకుట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నూతన దర్శకుడు నరేంద్ర దర్శకత్వంలో మహేష్ ఎస్.కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తితో పాటు మరో మూడు ముఖ్య పాత్రలు ఉంటాయని సమాచారం. ఇదిలా ఉంటే... `మహానటి`కి ఛాయాగ్రహణం అందించిన డ్యానీ ఈ సినిమాకి కూడా…