
ట్యాగ్ · 5 కథనాలు


హీరో కార్తికేయ నిశ్చితార్థం

షూటింగ్ పూర్తి చేసుకున్న 'రాజా విక్రమార్క'

3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న "RX 100 "

గ్రాండ్ గా కార్తికేయ , లోహితల వెడ్డింగ్
సూపర్ హిట్” RX 100” సినిమా లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి కార్తికేయ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. "హిప్పీ ","గుణ 369 ", " 90ML.", "చావు కబురు చల్లగా", "రాజా విక్రమార్క" వంటి మూవీస్ తో కార్తికేయ ప్రేక్షకులను అలరించారు. హీరో నాని"గ్యాంగ్ లీడర్ "మూవీ తో ప్రతినాయకుడి గా ప్రేక్షకులను అలరించిన కార్తికేయ అజిత్ హీరోగా తెరకెక్కిన “వాలిమై”తమిళ మూవీ లో కార్తికేయ ప్రతి నాయకుడిగా నటించారు. “వాలిమై” మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

'వాలిమై'.. కార్తికేయ ఫస్ట్ లుక్ రిలీజ్
ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కార్తికేయ ఆ తరువాత వరుసగా అవకాశాలతో కెరీర్ బ్రేక్ లు లేకుండా దూసుకువెళుతున్నాడు. కేవలం హీరోగానే కాకుండా ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని నాని గ్యాంగ్ లీడర్ లో విలన్ రోల్ చేసి చెప్పకనే చెప్పాడు. ఇక హీరోగా ఎలా అయితే మొదటి సినిమాతో పేరు తెచ్చుకున్నాడో అలాగే విలన్ గా కూడా మొదటి సినిమాతో అంతే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈసినిమా తరువాతే కార్తికేయకు అజిత్ సినిమా వాలిమై లో విలన్ పాత్ర దక్కిందని చెప్పొచ్చు.

హీరో కార్తికేయ నిశ్చితార్థం
సెన్సేషనల్ హిట్ "RX 100" మూవీలో తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోగా మారిన కార్తికేయ "హిప్పీ ", "గుణ 369 ","90ML ", "చావు కబురు చల్లగా "వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. జయాపజయాలతో సంబంధం లేకుండా కార్తికేయ క్రేజీ హీరోగా కొనసాగడం విశేషం. "గ్యాంగ్ లీడర్ "మూవీ లో కార్తికేయ విలన్ గా నటించారు. హీరో కార్తికేయ ప్రస్తుతం "రాజా విక్రమార్క "మూవీ లో హీరోగా , "వాలిమై "తమిళ మూవీ లో విలన్ గా నటిస్తున్నారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న 'రాజా విక్రమార్క'
ఆర్‌ఎక్స్ 100 సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తికేయ. ఇక ఆసినిమా తరువాత ఇప్పటివరకూ వరుసగా సినిమాలు చేసుకుంటూనే వెళుతున్నాడు. కేవలం హీరోగానే కాకుండా అప్పుడప్పుడు విలన్ గా కూడా పలకరిస్తున్నాడు. ఇక ఈ ఏడాది చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు.

3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న "RX 100 "
కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ , పాయల్ రాజ్ పుత్ జంటగా చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన "RX 100 "మూవీ 2018 సంవత్సరం జూలై 12 వ తేదీ రిలీజ్ అయ్యి కమర్షియల్ గా విజయం సాధించింది. హీరో కార్తికేయ తన యాక్టింగ్ , డ్యాన్స్ , ఫైట్స్ తో నటుడిగా ప్రూవ్ చేసుకున్నారు. "RX 100 "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్తికేయ , పాయల్ ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.