ట్యాగ్ · 4 కథనాలు
యాక్షన్ థ్రిల్లర్ లో కళ్యాణ్ రామ్..!

కళ్యాణ్ రామ్ తో మైత్రీ మూవీ మేకర్స్ చిత్రం?
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ మూవీ ?
కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం?
లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు మనవడు , హీరో హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ “బాలగోపాలుడు “మూవీ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.సూపర్ హిట్ “అతనొక్కడే “, “హరే రామ్ “, “పటాస్ “, “118” మూవీస్ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి కళ్యాణ్ రామ్ పలు సక్సెస్ ఫుల్ మూవీస్ ను నిర్మించారు. హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ తో కలసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా “NTR 30 ” మూవీ ని నిర్మించనున్నారు.
యాక్షన్ థ్రిల్లర్ లో కళ్యాణ్ రామ్..!
‘118’ లాంటి థ్రిల్లర్ తో హిట్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ ఆ తర్వాత చేసిన ‘ఎంత మంచివాడవురా’ సినిమాతో హిట్ అందుకోలేకపోయారు. ప్రస్తుతం మల్లాది వేణు డైరెక్షన్ లో తన సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది సమ్మర్ లో ఈ సినిమా షూటింగ్ ను ప్లాన్ చేశారు కానీ.. కరోనా వల్ల ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపించనున్నట్టు తెలుస్తుంది.

కళ్యాణ్ రామ్ తో మైత్రీ మూవీ మేకర్స్ చిత్రం?
`శ్రీమంతుడు`, `జనతా గ్యారేజ్`, `రంగస్థలం`తో హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థగా పేరొందింది మైత్రీ మూవీ మేకర్స్. అగ్ర కథానాయకులతో పాటు యువ కథానాయకులతోనూ సినిమాలు నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రొడక్షన్ హౌస్... త్వరలో టాలెంటెడ్ స్టార్ నందమూరి కళ్యాణ్ రామ్ తో ఓ చిత్రాన్ని నిర్మించబోతోందట. ఇప్పటికే చర్చలు పూర్తయ్యానని... వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని సమాచారం.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ మూవీ ?
శ్రీ దేవి మూవీస్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ హీరోగా రూపొందిన రొమాంటిక్ డ్రామా "ఎంత మంచివాడవురా " మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెహరీన్ కథానాయిక. గోపిసుందర్ సంగీతం అందించారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ , పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.