
ట్యాగ్ · 5 కథనాలు

హ్యాపీ వరల్డ్ చాక్లెట్ డే - కాజల్ అగర్వాల్
ఛాలెంజింగ్ రోల్స్ ఇష్టం - కాజల్ అగర్వాల్

తాజ్ మహల్ "చందమామ "

దుల్కర్ సల్మాన్ కు జోడీగా కాజల్ అగర్వాల్

మరో బాలీవుడ్ మూవీ కి కాజల్ అగర్వాల్ గ్రీన్ సిగ్నల్
“లక్ష్మీ కళ్యాణం “మూవీ తో టాలీవుడ్ కు కాజల్ అగర్వాల్ కథానాయికగా పరిచయం అయ్యారు. సూపర్ హిట్ “చందమామ “మూవీ తో కాజల్ గుర్తింపు పొందారు. బ్లాక్ బస్టర్ “మగధీర ” మూవీ కాజల్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కాజల్ అగర్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “ఆచార్య “ , నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ )మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. కాజల్ ఇప్పుడు ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాజల్ అగర్వాల్…
హ్యాపీ వరల్డ్ చాక్లెట్ డే - కాజల్ అగర్వాల్
తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలలో ఛాలెంజింగ్ రోల్స్ ఎంపిక చేసుకుని కాజల్ అగర్వాల్ పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. కాజల్ ప్రస్తుతం "ఆచార్య ", "మోసగాళ్ళు " మూవీస్ తో పాటు 2 తమిళ, ఒక హిందీ మూవీ లో నటిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో మెడిటేషన్ , యోగా , వర్కౌట్స్, సోషల్ మీడియా లో ఫొటోస్ షేర్ చేస్తూ కాజల్ టైమ్ పాస్ చేస్తున్నారు. చాక్లెట్ డే (జులై 7వ తేదీ ) సందర్భంగా కాజల్ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఛాలెంజింగ్ రోల్స్ ఇష్టం - కాజల్ అగర్వాల్
తెలుగు , తమిళ , హిందీ భాషల సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. లాక్ డౌన్ సమయంలో మెడిటేషన్ , యోగా , వర్కౌట్ , టీవీ లో రామాయణం , మహాభారతం సీరియల్స్ చూస్తూ , భగవద్గీత, భాగవత పురాణాలు పఠిస్తూ , కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ, ఆన్ లైన్ క్లాసెస్ కు అటెండ్ అవుతూ కాజల్ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. కాజల్ ప్రస్తుతం "ఆచార్య ", "మోసగాళ్ళు ", "ఇండియన్ 2", "హేయ్ సనమిక (తమిళ ), "ముంబై సాగ "(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు.

తాజ్ మహల్ "చందమామ "
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని ఆగ్రా సిటీ లో యమునా నది ఒడ్డున నిర్మించిన తాజ్ మహల్ 1632 సంవత్సరం లో నిర్మాణం ప్రారంభమై 1648 సంవత్సరంలో పూర్తయింది. మొఘల్ సంస్థాన రాజు షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధం నిర్మించిన తాజ్ మహల్ ఒక అద్భుత కట్టడంగా ప్రజలను ఆకట్టుకుంటుంది. న్యూ సెవెన్ వండర్స్ ఆఫ్ వరల్డ్ గా డిక్లేర్ చేయబడిన తాజ్ మహల్ ప్రతీ రోజూ వేలాది సందర్శకులతో విరాజిల్లుతుంది. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన కుటుంబ సభ్యులతో తాజ్ మహల్ ను సందర్శించారు.

దుల్కర్ సల్మాన్ కు జోడీగా కాజల్ అగర్వాల్
మలయాళ, తమిళ, హిందీ, తెలుగు మూవీస్ లో సక్సెస్ ఫుల్ హీరో గా రాణిస్తున్న దుల్కర్ సల్మాన్, టాలీవుడ్, కోలీవుడ్ ల స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ జంటగా రూపొందుతున్న తమిళ మూవీ షూటింగ్ ఈ రోజు చెన్నై లో ప్రారంభం అయ్యింది. రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ కి ప్రముఖ కొరియోగ్రాఫర్ బృంద మాస్టర్ దర్శకత్వం వహిస్తున్నారు.