
ట్యాగ్ · 4 కథనాలు


'ఎన్టీఆర్' సినిమాలో 'శివగామి'..!
మరోసారి... యన్టీఆర్, పూజా హెగ్డే జోడి?

#NTR30 అఫీషియల్ త్రివిక్రమ్ తోనే కన్ఫామ్

స్పీడు పెంచుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్
హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ , పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా"అరవింద సమేత వీర రాఘవ "మూవీ 2018 అక్టోబర్ 18 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఆ మూవీ తరువాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన "రౌద్రం రణం రుధిరం "మూవీ తో ఎన్టీఆర్ మమేకం అయ్యారు. ఈ మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భా రీ ఎత్తున రిలీజ్ కానుంది. "ఆర్ ఆర్ "ఆర్"మూవీ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ బిజీగా వున్నారు.

'ఎన్టీఆర్' సినిమాలో 'శివగామి'..!
ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య' మూవీ తెరకెక్కిస్తున్నాడు. గత రెండేళ్లుగా కొరటాల ఇదే సినిమా పై పనిచేస్తున్నాడు. నిజానికి గతేడాది విడుదల కావాల్సిన ఆచార్య మూవీ.. కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి వాయిదాపడుతూ వచ్చింది. ఆఖరికి ఈ ఏడాది మేలో రిలీజ్ చేద్దామని మేకర్స్ ప్రకటించగా.. ఈసారి కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. చివరిదశలో ఉన్నటువంటి ఆచార్య షూటింగ ఆగిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ లేనందున ఆ సమయాన్ని ఎన్టీఆర్ స్క్రిప్ట్ కోసం కేటాయిస్తున్నాడు.
మరోసారి... యన్టీఆర్, పూజా హెగ్డే జోడి?
`అరవింద సమేత` తరువాత యంగ్ టైగర్ యన్టీఆర్, సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న విషయం విదితమే. హారికా అండ్ హాసిని క్రియేషన్స్, యన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ మే నెలలో సెట్స్ పైకి వెళ్ళనుంది. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ లో వేసవి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.

#NTR30 అఫీషియల్ త్రివిక్రమ్ తోనే కన్ఫామ్
ఎన్టీఆర్ తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నాడు... ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అదే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ముగిసిన తర్వాత ఎన్టీఆర్ ఏ డైరెక్టర్‌తో సినిమా చేస్తాడో అనే దానిపై పలు వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ పేర్లు వినిపించాయి. అంతేకాదు ఎన్టీఆర్ ఎవరితో చేస్తే బావుంటది అన్న పోల్స్ కూడా నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ వార్తలన్నిటికీ బ్రేక్ పడింది. ఫైనల్ గా ఎన్టీఆర్ తర్వాత సినిమా ఎవరితో ఉండబోతుందో క్లారిటీ ఇచ్చేసారు. మరోసారి త్రివిక్రమ్ తోనే ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా…