
ట్యాగ్ · 4 కథనాలు


ఎన్టీఆర్ రూమర్ నిజం అయితే బాగుంటుంది..!
రీమేక్ మూవీస్ లో జాన్వీ కపూర్

తెలుగు మూవీ హిందీ రీమేక్ లో జాన్వీ కపూర్ ?

జాన్వీ కపూర్ లేటెస్ట్ వర్కవుట్ వీడియో
సూపర్ హిట్ ధడక్ మూవీతో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కథానాయికగా తెరకెక్కిన గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన జాన్వీ బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. సూపర్ హిట్ రూహి, గుడ్ లక్ జెర్రీ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. మలయాళ సూపర్ హిట్ హెలెన్ మూవీ హిందీ రీమేక్ మిలి మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి జాన్వీ ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ జాన్వీ ప్రస్తుతం బవాల్, Mr &Mrs మహి మూవీస్ లో నటిస్తున్నారు.

ఎన్టీఆర్ రూమర్ నిజం అయితే బాగుంటుంది..!
ఎన్టీఆర్ తో ఆ రూమర్ నిజం అయితే బాగుంటుంది అని అంటుంది బాలీవుడ్ యంగ్ యాక్ట్రెస్ జాన్వీ కపూర్. మరి ఆ రూమర్ ఏంటో అన్నది ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసి ఉంటుంది కదా. అసలు సంగతేంటంటే.. రీసెంగానే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు తన కొత్త సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ 30 వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాలోనే జాన్వీ కపూర్ నటిస్తుందంటూ ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. అయితే అప్పట్లో టాలీవుడ్ ఎంట్రీపై బోనీ కపూర్ కూడా స్పందిస్తూ అదేంలేదని క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా ఈవార్తలకు మాత్రం బ్రేకు పడలేదు.
రీమేక్ మూవీస్ లో జాన్వీ కపూర్
లెజెండరీ యాక్ట్రెస్ , అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్ మరాఠీ మూవీ "సైరాట్ " హిందీ రీమేక్ మూవీ "ధడక్" తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "ధడక్" మూవీ ఘనవిజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరింది. అంథాలజీ మూవీ "ఘోస్ట్ స్టోరీస్"లో ఒక ఎపిసోడ్ లో జాన్వీ నటించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ గుంజన్ సక్సేనా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన " గుంజన్ సక్సేనా : ది కార్గిల్ " మూవీ తో జాన్వీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జాన్వీ హీరోయిన్ గా "రూహి అఫ్జానా", "దోస్తానా 2 " మూవీస్ రూపొందుతున్నాయి.

తెలుగు మూవీ హిందీ రీమేక్ లో జాన్వీ కపూర్ ?
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన "అల .. వైకుంఠపురములో .." మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సంగీత దర్శకుడు థమన్ స్వరకల్పన లో రూపొందిన సాంగ్స్ విశేష ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు "అల .. వైకుంఠపురములో .." మూవీ హిందీ భాషలో రీమేక్ కానుంది. ఈ మూవీ లో జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.