
ట్యాగ్ · 5 కథనాలు


గోపీచంద్ 30వ సినిమాలో జగ్గూభాయ్..!

జగపతి బాబు సంచలన నిర్ణయం

'లక్ష్య' జగపతిబాబు లుక్ రిలీజ్

సూపర్ స్టార్ సినిమాలో జగ్గుభాయ్

సల్లూ భాయ్ కోసం రెడీ అవుతున్నా
ఫ్యామిలీ సినిమాలంటే గుర్తొచ్చే హీరోల్లో జగపతిబాబు కూడా ముందుంటాడు. ఆ తరువాత యంగ్ హీరోలు రావడం... సినిమా ఛాన్స్ లు తగ్గడం.. దానికి తోడు ఆర్ధిక సమస్యలు కూడా రావడంతో సరైన బ్రేక్ కోసం ఎదురుచూశాడు జగ్గూభాయ్. చాలా గ్యాప్ తర్వాత లెజెండ్ సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు.. ఆ సినిమా హిట్టవ్వడంతో జగపతి బాబుకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఒకప్పుడు కుటుంబకథా చిత్రాలు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి...ఇప్పుడు విలన్ గా, ఫాథర్ గా, పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు జగపతి బాబు.

గోపీచంద్ 30వ సినిమాలో జగ్గూభాయ్..!
ఒకప్పుడు స్టార్ హీరోగా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలతో తెలుగు తెరపై సందడి చేసిన ఫ్యామిలీ హీరో జగపతిబాబు. ఇప్పుడు ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో పలు కీలక పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు పలు భాషల్లో కూడా సినిమా అవకాశాలను దక్కించుకుంటున్నాడు జగ్గూభాయ్. ఇక ఇప్పుడు మరో తెలుగు సినిమాలో మరో కీలక పాత్రలో నటించనున్నాను. గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జగపతిబాబు ఒక కీలక పాత్రలో నటించనున్నారు. గోపీచంద్ కెరీర్ లో వస్తున్న 30వ సినిమా ఇది. ఇక నేడు జగపతిబాబు పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ జగపతి బాబు పోస్టర్ ను…

జగపతి బాబు సంచలన నిర్ణయం
"సింహస్వప్నం"(1989 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన జగపతిబాబు పలు సూపర్ హిట్ మూవీస్ లో హీరోగా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "లెజెండ్" (2013)మూవీ లో స్టైలిష్ విలన్ గా నటించి ప్రేక్షకులను అలరించారు. పలు సూపర్ హిట్ మూవీస్ లో విలన్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన జగపతి బాబు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారారు. జగపతి బాబు నటించిన "గని ", "రాధేశ్యామ్ "మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం జగపతి బాబు "సలార్" మూవీ లో నటిస్తున్నారు.

'లక్ష్య' జగపతిబాబు లుక్ రిలీజ్
సంతోష్ జాగర్లపుడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న సినిమా లక్ష్య. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఇదిలా ఉండగా మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక తాజాగా ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న జగపతిబాబు లుక్ ను రిలీజ్ చేశారు. ఇందులో జగపతిబాబు 'పార్ధసారధి' అనే పాత్రను పోషిస్తున్నట్టు తెలుపుతూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

సూపర్ స్టార్ సినిమాలో జగ్గుభాయ్
శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అన్నాత్తే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే ఈ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తయింది. అయితే ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలివుంది. ఇటీవలే మళ్లీ ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి కొద్దిరోజులు హైదరాబాద్ లో కూడా షూటింగ్ జరిపారు. అయితే అదే సమయంలో చిత్ర యూనిట్ లో కరోనా కలకలంతో షూటింగ్ కు బ్రేక్ వేశారు. ఆ తర్వాత రజినీకాంత్‌కి ఆరోగ్య సమస్య తలెత్తడంతో.. చెన్నై వెళ్లిపోయారు. మళ్లీ ఇప్పటి వరకూ షూటింగ్ విషయంలో ఎలాంటి అప్ డేట్ లేదు.