
ట్యాగ్ · 4 కథనాలు


క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కు జోడీగా శ్రీలీల ?

టాలీవుడ్ భారీ ఆఫర్స్ తో బిజీగా శ్రీలీల

హీరో రవితేజ కు జోడీగా శ్రీలీల

శ్రీలీల అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్
తెలుగులో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన పెళ్లి సందడి తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ శ్రీలీల. ఈసినిమాలో తన యాక్టింగ్,డ్యాన్స్ తో యూత్ ను బాగా అట్రాక్ట్ చేసింది.పెళ్ళిసందడి కమర్షియల్ గా కూడా సక్సెస్ కావడంతో శ్రీలీల కలిసొచ్చింది.ఈసినిమా తరువాత రవితేజ నటించిన ధమాకాలో,శ్రీ లీల,హీరోయిన్ గా చేసింది.ఈసినిమాతో శ్రీలీల ఫేట్ మారిపోయింది.ఇందులో కూడా తను చేసిన డ్యాన్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఇక్కడ నుండి వరుస గా ఆఫర్లు క్యూ కట్టాయి.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది సినిమాలకు సైన్ చేసి మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కు జోడీగా శ్రీలీల ?
కమర్షియల్ హిట్ పెళ్ళిసందD మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన శ్రీలీల, ఆ మూవీలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కించిన ధమాకా మూవీతో మరొక భారీ సక్సెస్ సొంతం చేసుకుని బాగా ఫామ్ లో ఉన్న శ్రీలీల ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటున్నారు. శ్రీలీల యంగ్ హీరోస్ మూవీస్ తో పాటు సీనియర్ హీరోస్ మూవీస్ లో కూడా నటిస్తున్నారు.

టాలీవుడ్ భారీ ఆఫర్స్ తో బిజీగా శ్రీలీల
కమర్షియల్ హిట్ “పెళ్ళిసందD “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన శ్రీలీల , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ ను శ్రీలీలే అందుకుంటున్నారు. శ్రీలీల ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కుతున్న “ధమాకా ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫార్చున్ 4 సినిమాస్ బ్యానర్స్ పై కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న “అనగనగా ఒకరాజు”, వారాహి చలన చిత్ర బ్యానర్ పై రాధాకృష్ణ దర్శకత్వంలో గాలి జనార్థన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న మూవీస్ లో శ్రీ లీల కథానాయికగా నటిస్తున్నారు.

హీరో రవితేజ కు జోడీగా శ్రీలీల
"కిస్ "మూవీ తో కన్నడ చిత్ర పరిశ్రమ లో కెరీర్ ప్రారంభించిన శ్రీలీల , శ్రీ మురళి హీరోగా రూపొందిన "భరాటి" కన్నడ మూవీ లో కథానాయికగా నటించారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోణంకి దర్శకత్వంలో ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా "పెళ్ళిసందD" మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తో శ్రీలీల కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. "పెళ్ళిసందD" మూవీ రిలీజ్ కాకుండానే శ్రీలీల టాలీవుడ్ లో బిగ్ ఆఫర్ అందుకున్నారు.