
ట్యాగ్ · 4 కథనాలు

అఫీషియల్.. కార్తికేయతో సుకుమార్ సినిమా
'చావు కబురు చల్లగా' రిలీజ్ డేట్ ఫిక్స్
మల్లీ హ్యాపీ బర్త్ డే.. అల్లాడించేద్దాం..!

రియల్ టైగర్ తో హీరో కార్తికేయ
ప్రేమతో మీ కార్తీక్ చిత్రం తో కార్తికేయ టాలీవుడ్ కు పరిచయమా అయ్యారు. అజయ్ భూపతి దర్శకత్వంలో నటించిన ఆర్‌ఎక్స్ 100 చిత్రం భారీ విజయాన్ని సాధించడంతో కార్తికేయ క్రేజీ హీరోగా మారారు. హిప్పీ, గుణ 369, నాని గ్యాంగ్ లీడర్, 90ఎంఎల్ చిత్రాలలో కార్తికేయ ప్రేక్షకులను అలరించారు.అటు హీరోగా నటిస్తూనే హీరో నాని తో గ్యాంగ్ లీడర్ చిత్రంలో విలన్ గా నటించి కార్తికేయ విమర్శకుల ప్రశంసలందుకున్నారు. గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ పాత్రకుగాను ఆయన ఉత్తమ విలన్ గా సైమాఅవార్డును అందుకున్నారు. చావు కబురు చల్లగా, రాజావిక్రమార్క మూవీస్ లో నటించారు.
అఫీషియల్.. కార్తికేయతో సుకుమార్ సినిమా
మొత్తానికి సుకుమార్ అటు డైరెక్షన్ తో పాటు ఇటు నిర్మాణ రంగంలో కూడా దూసుకుపోతున్నాడు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా యంగ్ స్టార్ట్ తో సినిమాలు నిర్మిస్తున్నాడు. మొదట రాజ్ తరుణ్ తో కుమారి 21ఎఫ్ సినిమాతో సక్సెస్ అందుకున్న సుకుమార్.. ఇటీవల ఉప్పెన తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక ఇదే జోష్ తో మరో యంగ్ హీరోతో సినిమాను లైన్ లో పెట్టాడు. అంతేకాదు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు.
'చావు కబురు చల్లగా' రిలీజ్ డేట్ ఫిక్స్
ఆర్ ఎక్స్ 100 సినిమాతో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కార్తికేయ. ఆ తర్వాత సినిమాల్లో నటించిన ఆశించినంత విజయం అందించలేకపోయాయి. ఈ మధ్య గ్యాంగ్ లీడర్ సినిమాతో విలన్ గా కూడా తన టాలెంట్ ను చూపించాడు. ఈ పాత్రకు కూడా మంచి పేరొచ్చింది. ప్రస్తుతం కార్తికేయ కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో 'చావు కబురు చల్లగా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన హీరో, హీరోయిన్‌ల లుక్స్, 'బస్తీ బాలరాజు' క్యారెక్టర్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
మల్లీ హ్యాపీ బర్త్ డే.. అల్లాడించేద్దాం..!
కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ చేస్తున్న సినిమా 'చావు కబురు చల్లగా'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడగా తిరిగి కరోనా నిబంధనలతో షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో కార్తికేయ బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి సినిమా చేస్తుండగా మల్లిక పాత్రలో నటిస్తుంది.