
ట్యాగ్ · 4 కథనాలు


వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో "F3 "

'ఎఫ్ 3' పై కామెడీ కింగ్ ప్రశంసలు
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన సినిమా ఎఫ్3. 2019 లో రిలీజ్ అయి సూపర్ హిట్ సినిమా 'ఎఫ్ 2'కి సీక్వెల్ గా దీన్ని తెరకెక్కించారు. దాదాపు 'ఎఫ్ 2' సినిమాలో నటించిన నటీనటులే చాలామంది ఈసినిమాలో కూడా నటించారు. అయితే 'ఎఫ్3'లో అలీ, సునీల్, సోనాల్ చౌహన్ లాంటి కొన్ని కొత్త క్యారెక్టర్లను తీసుకున్నారు. మే 27న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి క్యూ కడుతున్నారు. లాజిక్స్ లేని ఈ కామెడీ ఎంటర్టైనర్ ను బాగానే ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా సత్తా చాటుతోంది. ఓవర్సీస్ లో కూడా ఈ…

ఓవర్సీస్ లో 'ఎఫ్ 3' రికార్డ్ కలెక్షన్స్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన ఈసినిమా ఎఫ్3. ఈసినిమా మే 27వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఇక సమ్మర్ సోగాళ్లుగా బరిలో దిగిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకపోతుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా ఎక్కడా తగ్గేదేలే అంటుంది. ఈసినిమా రిలీజ్అయి ఐదు రోజులు అవుతున్నా ఇంకా మంచి కలెక్షన్స్ రాబడుతూనే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఐదో రోజు 3 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టగా.. ఐదు రోజులకు గాను 35 కోట్లకు పైగా షేర్ ను రాబట్టినట్టు తెలుస్తుంది. ఇక ఈ వీకెండ్ లోపు 50 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు సినీ విశ్లేషకులు.

వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో "F3 "
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ 27 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్, సునీల్ కీలక పాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.హీరో వెంకటేష్ తన కామెడీ టైమింగ్‌తో మరోసారి ఈ సినిమాకే హైలెట్ గా నిలిచారు. ఫ్యామిలీ సీన్స్, మనీ ఫ్రస్ట్రేషన్ సీన్స్ ప్రేక్షకులను అలరించాయి.

'ఎఫ్ 3' అమెరికాలో సమ్మర్ సోగ్గాళ్ళ హవా..!
మొత్తానికి ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి రిజల్ట్ ను రాబట్టుకుంది ఎఫ్3 సినిమా. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన ఈసినిమా నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాకు కూడా ఎక్కడ చూసినా హిట్ టాకే వినిపించింది. మరోసారి అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేశాడు. నిజానికి సీక్వెల్ సినిమాలు సక్సెస్ అవుతాయన్న నమ్మకం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు సీక్వెల్ గా వచ్చి బాక్సీఫీస్ వద్ద బోల్తా కొట్టినవి చూశాం. కానీ ఎఫ్2 సీక్వెల్ గా వచ్చిన ఈసినిమా మాత్రం సూపర్ సక్సెస్ ను అందుకుంది.