
ట్యాగ్ · 5 కథనాలు


'ఆడవాళ్లు మీకు జోహార్లు' కోసం రాక్ స్టార్

రామ్ 19 సినిమాకు డీఎస్పీ

దేవి శ్రీ ప్రసాద్ పాటకు సుక్కూ డ్యాన్స్
'గబ్బర్ సింగ్' ఆడియో లాంచ్.. బ్రహ్మీ-అలీ కామెడీ

బాలీవుడ్ లో సోలో మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్
సక్సెస్ ఫుల్ "దేవి " మూవీ తో సంగీత దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన దేవి శ్రీ ప్రసాద్ తెలుగు, తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు అద్భుతమైన సంగీతం అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. పలు భాషలలో 100 పైగా మూవీస్ కు సంగీతం అందించిన దేవిశ్రీ "మన్మధుడు ", "వర్షం ", "ఆర్య ", "శంకర్ దాదా ఎంబిబిఎస్ ", నువ్వొస్తానంటే నేనొద్దంటానా" ,""బొమ్మరిల్లు ", "జల్సా ", "గబ్బర్ సింగ్" , "అత్తారింటికి దారేది ", ""శ్రీమంతుడు ", "నాన్నకు ప్రేమతో ", "జనతా గ్యారేజ్ ", "ఖైదీ నెం 150 ", "జై లవకుశ ","రంగస్థలం ", "సరిలేరు నీకెవ్వరు ", "ఉప్పెన", "పుష్ప :ది రైజ్ "వంటి సూపర్ హిట్ మూవీస్ లో సాంగ్స్ అద్భుతంగా…

'ఆడవాళ్లు మీకు జోహార్లు' కోసం రాక్ స్టార్
కిషోర్ దర్శకత్వంలో శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా టైటిల్‌ని బట్టి ఈ చిత్రంలోని ఫీమేల్ క్యారెక్టర్స్ కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న సహా ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కిషోర్ తిరుమల.

రామ్ 19 సినిమాకు డీఎస్పీ
ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు రామ్. ఇప్పుడు తమిళ్ డైరెక్టర్ లింగుస్వామితో రామ్ 19 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా రామ్ తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుండగా.. లింగుస్వామికి ఇది తొలి తెలుగు చిత్రంగా నిలువనుంది. ఇక ఈ సినిమాలో రామ్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ అఫీసర్ రోల్‌లో కనిపించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. త్వరలోనే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

దేవి శ్రీ ప్రసాద్ పాటకు సుక్కూ డ్యాన్స్
సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. ఈ సినిమాపై పెరిగిన అంచనాల కారణంగా సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ లవర్స్. ఇక సినిమాలో పాటలు హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్టే. ఇక ఉప్పెన సినిమాపై అంచనాలు పెరగడానికి టీజర్, ట్రైలర్ తో పాటు ఈ సినిమాలో పాటలు అని చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలు మంచి హిట్టయ్యాయి. ఇక నీ కళ్లు నీలి సముద్రం పాట అయితే యూ ట్యూబ్ లో వ్యూస్ తో దూసుకుపోతుంది.
'గబ్బర్ సింగ్' ఆడియో లాంచ్.. బ్రహ్మీ-అలీ కామెడీ
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత సంచలన విజయం దక్కిచుకుందో తెలుసు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘దబంగ్’కి రీమేక్‌గా రూపొందిన ‘గబ్బర్ సింగ్’ ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ ‘గబ్బర్ సింగ్’గా పవన్ నటించిన తీరు.. ఆయన అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులను కూడా మురిపించింది.తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి పవర్ స్టార్ ఎనర్జీకి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు దర్శకుడు హరీష్ శంకర్.