ట్యాగ్ · 5 కథనాలు
"దృశ్యం" మూవీ సీక్వెల్
దృశ్యం`కి సీక్వెల్
వసూళ్ళ వర్షం కురిపిస్తున్న చైనీస్ `దృశ్యం`

వెంకటేష్ ‘దృశ్యం’కు ఐదేళ్ళు
థ్రిల్లర్ మూవీ "దృశ్యం "
సురేష్ ప్రొడక్షన్స్ , రాజ్ కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ , వైడ్ యాంగిల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై తెలుగు , తమిళ , మలయాళ సక్సెస్ ఫుల్ చిత్ర సీనియర్ హీరోయిన్ శ్రీప్రియ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా రూపొందిన థ్రిల్లర్ "దృశ్యం " మూవీ ఘనవిజయం సాధించింది. మలయాళ చిత్రపరిశ్రమ లో పలు రికార్డ్స్ క్రియేట్ చేసిన బ్లాక్ బస్టర్ "దృశ్యం " మూవీ కి రీమేక్ గా రూపొందిన ఈ మూవీ లో నదియా , నరేష్ , పరుచూరి వెంకటేశ్వర రావు , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. శరత్ సంగీతం అందించారు.
"దృశ్యం" మూవీ సీక్వెల్
ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా రూపొందిన "దృశ్యం " మలయాళ మూవీ ఘనవిజయం సాధించింది. "దృశ్యం " మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, సింహ లీస్ భాషలలో రీమేక్ అయ్యి అన్ని భాషలలోనూ విజయం సాధించింది. చైనీస్ భాష లో రీమేక్ అయిన ఫస్ట్ ఇండియన్ మూవీ గా "దృశ్యం " రికార్డ్ క్రియేట్ చేసింది. "దృశ్యం " మూవీ బెస్ట్ ఫిల్మ్ గా కేరళ స్టేట్ అవార్డ్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్ తో పాటు పలు అవార్డ్స్ అందుకుంది.
దృశ్యం`కి సీక్వెల్
‘దృశ్యం’.. 2013లో విడుదలైన ఈ మలయాళ చిత్రం మాలీవుడ్‌లో వసూళ్ళ వర్షం కురిపించి అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, సింహళీ భాషల్లోనూ పునర్నిర్మితమై ఆయా చోట్ల మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు.. గత దశాబ్దంలోనే ఎక్కువ భాషల్లో రీమేక్ అవడమే కాకుండా.. చైనాలో రీమేక్ అయిన తొలి భారతీయ చిత్రంగానూ చరిత్ర సృష్టించింది. కట్ చేస్తే.. 7 ఏళ్ళ తరువాత ‘దృశ్యం’కి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించాడు మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్.
వసూళ్ళ వర్షం కురిపిస్తున్న చైనీస్ `దృశ్యం`
భారతీయ తెరపై పలు విదేశీ కథలు సంచలనం సృష్టించాయి. అయితే, ఇక్కడి సినిమాలు అక్కడ రీమేక్ అవడం అరుదుగా జరుగుతుంది. అలాంటి అరుదైన ప్రయత్నమే... `షీప్ వితౌట్ ఎ షెఫర్డ్`. మలయాళ చిత్రం `దృశ్యం`కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమా... గత ఏడాది డిసెంబర్ 13న విడుదలై... చైనాలో 2019 టాప్ 10 హయ్యస్ట్ గ్రాసర్స్ లో స్థానం దక్కించుకుంది. ఇప్పటికీ వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. మొత్తమ్మీద... ఒక భారతీయ చిత్రం విదేశీ భాషలో రీమేక్ కావడమే కాకుండా కమర్షియల్ గానూ సెన్సేషన్ క్రియేట్ చేయడం రేర్ రికార్డ్ గానే చెప్పుకోవచ్చు.

వెంకటేష్ ‘దృశ్యం’కు ఐదేళ్ళు
విక్టరీ వెంకటేష్, అందాల తార మీనా జంటగా పలు విజయవంతమైన కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘దృశ్యం’ ఒకటి. మహిళా దర్శకురాలు శ్రీ ప్రియ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీలో నదియా, నరేష్ ముఖ్య భూమికలు పోషించగా... కృతిక జయకుమార్, బేబి ఎస్తేర్, పరుచూరి వెంకటేశ్వరరావు, బెనర్జీ, చలపతిరావు, అన్నపూర్ణ, ఉత్తేజ్, రవి కాలె, సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.