ట్యాగ్ · 27 కథనాలు · పేజీ 2
డిస్కో రాజా మూవీ యాక్షన్ సీన్స్ షెడ్యూల్ పూర్తి

ఐస్ ల్యాండ్ లో షూట్ కు రెడీ అయిన 'డిస్కో రాజా'

గోవాలో ‘డిస్కో రాజా’ సందడి

రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న 'డిస్కో రాజా'

ఢిల్లీ వెళ్ళనున్న `డిస్కో రాజా`
భారీ సెట్ లో డిస్కోరాజా
తుది దశలో ‘డిస్కో రాజా’?
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘డిస్కో రాజా’. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రవితేజ తండ్రీకొడుకులుగా డ్యూయెల్ రోల్‌లో దర్శనమివ్వనున్నాడు. ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ కథానాయికలుగా నటిస్తుండగా... సునీల్, రామ్‌కీ, బాబీ సింహా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
డిస్కో రాజా మూవీ యాక్షన్ సీన్స్ షెడ్యూల్ పూర్తి
SRT ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మాస్ మహారాజా రవితేజ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ రివెంజ్ డ్రామా డిస్కో రాజా మూవీ డిసెంబర్ 20 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో పాయల్ రాజ్ పుత్, తాన్యా హోప్, నభా నటేష్ కథానాయికలు. వెన్నెల కిషోర్, సునీల్ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ S సంగీతం అందించారు. వినాయక చవితి సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఐస్ ల్యాండ్ లో షూట్ కు రెడీ అయిన 'డిస్కో రాజా'
వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే గోవాలో ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ కోసం యూరప్ వెళ్ళింది. యూరప్ లోని ఐస్ లాండ్ లో ఒక భారీ యాక్షన్ సీన్ ను చిత్రీకరించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఐస్ ల్యాండ్ లో షూట్ కు రెడీ అయింది. ఈ విషయాన్ని స్వయంగా తమ ట్విట్టర్ ద్వారా తెలిపింది చిత్రయూనిట్.

గోవాలో ‘డిస్కో రాజా’ సందడి
మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కో రాజా’. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ కథానాయికలుగా నటిస్తుండగా... సునీల్, రామ్‌కీ, బాబీ సింహా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న 'డిస్కో రాజా'
మొత్తానికి 'డిస్కో రాజా' కు సంభందించిన అప్ డేట్స్ ఇవ్వడంలో వేగం పెంచారు చిత్ర యూనిట్. నిన్ననే ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. వినాయక చవితి పండుగ రోజు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్టు..ఎస్ఆర్టీ ఎంటర్ టైన్మెంట్స్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. తాజాగా రిలీజ్ డేట్ ను కూడా అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఢిల్లీ వెళ్ళనున్న `డిస్కో రాజా`
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `డిస్కో రాజా`. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని వీఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తుండగా... రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నాడు. పిరియాడికల్ టచ్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అంతేకాదు... ఒక పాత్ర కోసం డిస్కో డాన్సర్‌గా సందడి చేయనున్నాడు.
భారీ సెట్ లో డిస్కోరాజా
వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ డిస్కోరాజా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ప్రస్తుతం ఈసినిమా అన్నపూర్ణా స్టూడియోలో వేసిన కోటి 20 లక్షల రూపాయిల సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది. పలు కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఇక షెడ్యూల్ తర్వాత డిస్కోరాజా టీం ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ ఈ నెల 26 తో పూర్తి చేసి.. ఆగష్ట్ మెదటివారం నుండి ఢిల్లి లో షూటింగ్ జరుపుకోనున్నారు.