ట్యాగ్ · 5 కథనాలు
కొరటాల, సుకుమార్ రూట్ లోకి హరీష్ శంకర్..!
వలస కూలీల పై హరీష్ శంకర్ ఆవేదన..!

మరో ఛాన్స్ కొట్టేసిన హరీష్..!
మణిశర్మకు వెరైటీ గా విషెస్ చెప్పిన హరీష్ - ఇంద్ర అని గ్యాప్ ఇచ్చి మళ్లీ అంటాం..!
మెలోడీ బ్రహ్మ అంటే సంగీత ప్రియులకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు మణిశర్మ అని. ఇక ఈ రోజు మణిశర్మ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు విషెస్ చెపుతున్నారు. ఈ సందర్భంగా హరీష్ శంకర్ కూడా మణిశర్మ కు తన ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పాడు. అయితే కాస్త వెరైటీ గా చెప్పాడు. ఈరోజుకీ.. ఇంద్ర.. అని గ్యాప్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నోటితో అనేసి మళ్లీ ఇంద్ర అంటాము. అంత ఇంపాక్ట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారూ.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్..’’ అని హరీష్ శంకర్ తన ట్విట్టర్ ద్వారా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
కొరటాల, సుకుమార్ రూట్ లోకి హరీష్ శంకర్..!
సినీ ఇండస్ట్రీలో కాలిక్యులేషన్స్ మారిపోతున్నాయి. ఈ మధ్య హీరోలు కూడా తమ సొంత కుంపటిని ఏర్పాటుచేసుకుని సొంతగా సినిమాలు తీసేసుకుంటున్నారు. మరి మేము మాత్రం సినిమాలే ఎందుకు డైరెక్ట్ చేయాలి అనుకుంటున్నారేమో డైరెక్టర్స్ కూడా నిర్మాతలుగా మారిపోతున్నారు. వాళ్ళ సినిమాలు వాళ్లే నిర్మించుకుంటున్నారు. ఇప్పటికే మన డైరెక్టర్స్ లో పూరీ జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాను తన ప్రొడక్షన్ లో తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఇక సుకుమార్ అయితే ఒక పక్క స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూనే మరోపక్క చిన్న హీరోలతో నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నాడు. కొరటాల శివ కూడా నిర్మాతగా మారి సినిమాలు తీసేందుకు రెడీ అయినట్టు గతంలోనే…
వలస కూలీల పై హరీష్ శంకర్ ఆవేదన..!
కరోనా మహమ్మారి నుండి దేశాన్ని కాపాడాలనే ఉద్దేశంతో రెండు నెలల నుండి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పేదలకు.. రోజు కూలీలు చేసే వారికి సాయం చేస్తూనే వున్నారు. అంతేకాదు పలువురు సినీ, రాజకీయ, క్రీడా కారులు ఇలా చాలా మంది పెద్ద ఎత్తున విరాళాలు చేశారు. సెలబ్రిటీస్ మాత్రమే కాదు సామాన్య ప్రజలు కూడా తమకు తోచినంత సాయం చేస్తున్నారు. ఇక ఇక్కడి వరకూ బాగానే ఉంది. అందరికీ ఏదో ఒకవిధంగా సాయం అందుతూనే వుంది. కానీ వలస కార్మికుల పరిస్థితి మాత్రం వేరు. వారికి బాధ మాత్రం దయనీయం. లాక్ డౌన్ విధించిన వెంటనే చావైనా, బతుకైనా అనుకుని కాలిబాటన వందల, వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వారి…
పవన్ సినిమాపై హరీష్ - తమ్ముడూ స్క్రిప్ట్, మ్యూజిక్ పనులు జరుగుతున్నాయి
ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా వున్నాడు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ అభిమాని తన ట్విట్టర్ ద్వారా ఎన్ని సినిమాలు అయినా చేయన్నా.. కానీ తదుపరి సినిమా పవర్ స్టార్ తో చేయి అంటూ ఓ అభిమాని చేసిన విన్నపానికి హరీశ్ స్పందించాడు. 'తమ్ముడూ... పవర్ స్టార్ మూవీ స్క్రిప్ట్ వర్క్, మ్యూజిక్ వర్క్ కొనసాగుతున్నాయి. పవన్ కల్యాణ్ చిత్రం తర్వాతే మరే కమిట్ మెంట్ అయినా. నేను కూడా మీలాంటి అభిమానే అని మర్చిపోకు' అని సమాధానం ఇచ్చాడు. ఇక సినిమాకు సంబంధిన వివరాలు త్వరలో తెలియనున్నాయి.

మరో ఛాన్స్ కొట్టేసిన హరీష్..!
గతకొద్ది నాలుగైదు రోజుల నుండి సోషల్ మీడియా లో హరీష్ శంకర్ పేరు గట్టిగానే వినిపిస్తుంది. దానికి కారణం హరీష్, బండ్ల గణేష్ మధ్య వారే. ఇక ఇది పక్కనపెడితే ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా వున్నాడు. ఈ సినిమాకు సంబంధిన వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఇక ఇప్పుడు మరో ఆఫర్ హరీష్ శంకర్ కు వచ్చినట్టు తెలుస్తుంది.