
ట్యాగ్ · 5 కథనాలు


రిస్క్ చేయడం వల్లే ఈ స్థాయిలో ఉన్నాను

ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పాలి..!

దిల్ రాజు రీమేక్ ల సందడి..!

TFDC ఛైర్మన్‌గా.. రేపే దిల్ రాజు ప్రమాణస్వీకారం
రెండు దశాబ్దాలకు పైగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా పలు భారీ, చిన్న చిత్రాలను నిర్మిస్తూ, మరికొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ శ్రీ వి. వెంకటరమణ రెడ్డి (దిల్ రాజు)కి అరుదైన గౌరవం దక్కింది. గతేడాది తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తెలుగు ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన ఇప్పుడు మరో కీలక పదవిని చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

రిస్క్ చేయడం వల్లే ఈ స్థాయిలో ఉన్నాను
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లలో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్ మొదలైన ఆయన ప్రయాణం ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ వరకూ సాగింది. ఆయన నుండి సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ అన్న నమ్మకం ఏర్పరుచుకున్నాడు. ఇన్నేళ్ల తన సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్లను, బ్లాక్ బస్టర్లను సొంతం చేసుకున్నాడు అలానే ఫ్లాప్స్ ను కూడా చూశాడు. అయినా కూడా నిలదొక్కుకొని ధైర్యంతో సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు.. ఆ ధైర్యమే ఇప్పుడు తనను ఈ స్థాయిలో ఉంచింది అంటున్నారు దిల్ రాజు కూడా.

చరణ్, విజయ్ సినిమాల రిలీజ్ డేట్లు చెప్పిన దిల్ రాజు..!
బాహుబలి సినిమా తరువాత తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ ఎంత పెరిగిందో చూస్తూనే ఉన్నాం. భారీ బడ్జెట్ సినిమాలు తీయడానికి మేకర్స్ ఏమాత్రం వెనుకాడట్లేదు. ఇక మన నిర్మాతలు కూడా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర బాషల్లో కూడా సినిమాలు చేయడానికి.. తమ మార్కెట్ ను పెంచుకోవడానికి చూస్తున్నారు. ఇక అందులో మొదటగా చెప్పుకోవాల్సింది దిల్ రాజుగురించి. టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ లలో దిల్ రాజు పేరు ముందు వరుసలో ఉంటుంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసి ఇప్పటికే తన మార్క్ ను చూపించాడు దిల్ రాజు.

ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పాలి..!
ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పాలి అని అంటున్నాడు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే... దిల్ రాజు నిర్మాతగా తమిళ్ లో సూపర్ హిట్ అయిన '96' సినిమా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. 'జాను' టైటిల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ టైటిల్ విషయంలోనే దిల్ రాజు ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పాడు.

దిల్ రాజు రీమేక్ ల సందడి..!
డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత నిర్మాతగా మారి ఇప్పుడు టాలీవుడ్ లోనే పెద్ద ప్రొడ్యూసర్ గా ఎన్నో హిట్ సినిమాలు అందిస్తున్నాడు దిల్ రాజు. దిల్ రాజు సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న రేంజ్ కు ఎదిగాడు. అదృష్టాన్ని ఎప్పుడూ తన పాకెట్ లో పెట్టుకొని తిరిగినట్టే దిల్ రాజు సినిమాలు అంటే మాగ్జిమమ్ హిట్ నే సొంతం చేసుకుంటాయి. చాలా తక్కువ సినిమాలే ప్లాప్ ను సొంతం చేసుకున్నాయి. ఇక గత ఏడాది సంక్రాంతి కి ఎఫ్2 తో బ్లాక్ బస్టర్ కొట్టిన దిల్ రాజు.. ఈ ఏడాది కూడా మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక ఇప్పటివరకూ స్ట్రెయిట్ సినిమాలే నిర్మించిన దిల్ రాజు.. ఇప్పుడు…