
ట్యాగ్ · 5 కథనాలు

మొన్న మహేష్ - నేడు తలైవా

బన్నీకి వార్నర్ స్పెషల్ బర్త్ డే విషెస్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రికెట్ తో తను ఎంత ఫేమస్ అయ్యాడో ఈమధ్య సోషల్ మీడియాలో కూడా పలు వీడియోలతో అంతే ఫేమస్ అయ్యాడు. గత కొద్దికాలంగా సోషల్ మీడియా లో వార్నర్ చేస్తున్న హంగామా అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా పాటలు, డైలాగ్స్ చెప్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ అందర్ని సౌత్ ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. అలవైకుంఠపురములో మూవీలో 'రాములో రాములా', 'బుట్టబొమ్మ' పాటలతో మొదలైన ఈ ప్రస్థానం ఆతరువాత పలు హీరోల పాటలకు కూడా తనదైన శైలిలో డ్యాన్స్ చేసి ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. పోకిరి సినిమాలో మహేష్ బాబు డైలాగ్.. బాహుబలి సినిమాలో 'అమరేంద్ర బాహుబలి అనే నేను'…

"తగ్గేదేలే "- డేవిడ్ వార్నర్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా 2 భాగాలుగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప” ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది. ఫహద్ ఫాజిల్ , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , అనసూయ ముఖ్యపాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై తెరకెక్కిన "పుష్ప" చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్…

'రౌడీ బేబి' ని దించేసిన 'డేవిడ్ వార్నర్'
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గత కొద్దికాలంగా సోషల్ మీడియా లో చేస్తున్న హంగామా అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా పాటలు, డైలాగ్స్ చెప్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ అందర్ని సౌత్ ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. అలవైకుంఠపురములో మూవీలో 'రాములో రాములా', 'బుట్టబొమ్మ' పాటలతో మొదలైన ఈ ప్రస్థానం ఇప్పుడు పలు హీరోల పాటలకు కూడా తనదైన శైశిలో డ్యాన్స్ చేసి ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. పోకిరి సినిమాలో మహేష్ బాబు డైలాగ్.. బాహుబలి సినిమాలో 'అమరేంద్ర బాహుబలి అనే నేను' డైలాగ్.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పక్కాలోకల్ సాంగ్‌కు చిందేశాడు. ఇక ఇప్పుడు రౌడీ బేబి సాంగ్ ను కూడా చిందేశాడు.
మొన్న మహేష్ - నేడు తలైవా
క్రికెట్ లో తన ఆటతో ఎలా మెప్పిస్తాడో.. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అదే సందడి చేస్తున్నాడు డేవిడ్ వార్నర్. మొన్న మహేష్ 'మహర్షి' సినిమాలో సీన్స్ తో అదరగొట్టిన వార్నర్ ఇప్పుడు తలైవాగా మారిపోయాడు. రీ ఫేస్ యాప్ ద్వారా 'మహర్షి' సినిమాలో సూపర్‌స్టార్ మహేశ్‌గా మారి అభిమానులను ఆకట్టుకున్న వార్నర్ ఇప్పుడు రజినీ కాంత్ 'దర్బార్' సినిమాలో కొన్ని సన్నివేశాలకు రజినీకాంత్‌కు బదలు తన ఫేస్‌ను యాడ్ చేసి ఆ వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఇక ఈ వీడియో ను పోస్ట్ చేస్తూ.. చాలా మంచి రిక్వెస్ట్ మేరకు ఇది చేశానని చెబుతూ అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలను తెలియజేశాడు.

‘మైండ్ బ్లాక్’ కోసం చాలా కష్టపడ్డాను - అలా అనిపించట్లేదన్న మహేష్
డేవిడ్ వార్నర్ టిక్‌టాక్ వీడియోలతో అభిమానులను అలరిస్తున్నాడు. ముఖ్యంగా తెలుగు డైలాగ్స్, పాటలతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు. బుట్టబొమ్మ, పోకిరి, బాహుబలి డైలాగ్స్‌తో టాలీవుడ్ అభిమానులను మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలో మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని ‘మైండ్ బ్లాక్’ పాటకు టిక్‌టాక్ చేయాల్సిందిగా మహేష్ బాబు ఫ్యాన్స్ కోరారు. దీంతో అభిమానుల కోరిక మేరకు ‘మైండ్ బ్లాక్’ పాటకు తన సతీమణితో కలిసి చిందులేశాడు.