
ట్యాగ్ · 25 కథనాలు · పేజీ 2

దసరా రివ్యూ : సూపర్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా
ఓవరాల్ గా భారీ అంచనాలతో వచ్చిన దసరా ఆ అంచనాలను అందుకొని నానికి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో నాని , కీర్తి సురేష్ ల నటన , యాక్షన్ సన్నివేశాలు , ఇంటర్వెల్ బ్లాక్ , క్లైమ్యాక్స్ ,సంగీతం హైలైట్స్ అయ్యాయి. కేవలం మాస్ , యూత్ మాత్రమే కాదు ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా వుంది ఈదసరా.

యూ ఎస్ లో ప్రీమియర్స్ తోనే హాఫ్ మిలియన్ డాలర్స్ రాబట్టిన దసరా
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ దసరా మూవీ ఈ రోజు (మార్చి 30 వ తేదీ) పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయిక. సాయి కుమార్, షైన్ టామ్ చాకో, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. హీరో నాని ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి ప్రమోషన్స్ భారీ గా చేసిన విషయం తెలిసిందే. దసరా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

దసరా కోసంమార్నింగ్ షోస్, ఎక్ట్స్రా షోస్
ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో దసరా ఒకటి. ఈసినిమాకోసం కేవలం నాని అభిమానులు మాత్రమే కాదు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి సారి నాని అంత ఊర మాస్ రోల్ లో కనిపిస్తుండటం.. డిఫరెంట్ కథ, ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అందరికీ ఆసక్తిని పెంచింది. ఇక ఇంకా ఒక్క రోజులో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.

దసరా ప్రీ రివ్యూ :
ఓవరాల్ గా భారీ అంచనాలతో రేపు విడుదలకానున్న ఈ చిత్రం ఆ అంచనాలను అందుకొని నాని కెరీర్ లో బిగ్గెస్ హిట్ గా నిలువడం ఖాయం. నాని , కీర్తి సురేష్ ల నటన , యాక్షన్ సన్నివేశాలు , సంగీతం సినిమాలో హైలైట్ గా నిలుస్తాయి. నాని ఫ్యాన్స్ కు మాత్రం దసరా తో పండగే.

నేను ఇంకా 73 కథలు వినాలి
న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న సినిమా దసరా. ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూసే సినిమా దసరా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రఫ్ అండ్ రస్టిక్ లుక్ తో తెలంగాణ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాతో నాని అలరించడానికి వస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో పెంచిన క్యూరియాసిటీని ఇప్పటివరకూ ఎక్కడా తగ్గించలేదు. వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచాయి తప్పా.. తగ్గించలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు మరింత పెంచింది.