
ట్యాగ్ · 24 కథనాలు · పేజీ 2


దసరా నాని మాస్ విశ్వరూపం

దసరా-ధూమ్ ధామ్ దోస్తానా అంటున్న నాని

"దసరా " మూవీ లో నాని ఇంటెన్స్ లుక్

దసరా ధూమ్ ధామ్ దోస్తాన్ సాంగ్ రిలీజ్
ఈమధ్య హీరోలు విభిన్నమైన పాత్రలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రొటీన్ గా కమర్షియల్ సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా తమను విభిన్నమైన పాత్రల ద్వారా ఆవిష్కరించుకోవడానికి ముందుకొస్తున్నారు. ఇక అలాంటి ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడని హీరోల్లో నాని కూడా ఒకరు. విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఈ ఏడాది అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆ సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు.

దసరా నాని మాస్ విశ్వరూపం
కెరీర్ ప్రారంభంనుండి విభిన్నమైన పాత్రలు చేసే హీరోల్లో న్యాచురల్ స్టార్ హీరో నాని కూడా ముందుంటాడు. ఇక నాని కామెడీ యాంగిల్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కామెడీతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దిట్ట. అయితే నాని మాస్ రోల్ లో చాలా తక్కువ పాత్రలే చేశాడు. కానీ ఫస్ట్ టైమ్ ఫుల్ మాసీ రోల్ లో వస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా దసరా. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది.

దసరా-ధూమ్ ధామ్ దోస్తానా అంటున్న నాని
రీసెంట్ గానే అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ప్రస్తుతం మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. దసరా అనే డిఫరెంట్ కథతో ఈసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇంతకుముందు ఎప్పుడు చేయని డీ గ్లామర్ పాత్రలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నాని. సింగరేణి బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి.

"దసరా " మూవీ లో నాని ఇంటెన్స్ లుక్
సూపర్ హిట్ “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ తరువాత నాని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.హీరో నాని ప్రస్తుతం ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో “దసరా “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ కథానాయిక. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు…