దసరా నాని మాస్ విశ్వరూపం

Nanis Mass Poster from Dasara Unveiled, Mass Poster from Dasara, Nanis Mass Poster, Nani's Dasara, Nani Latest Movie, Nani's Upcoming Movie, Dasara Mass Poster, Dasara Poster, Dasara, Dasara Telugu movie, Dasara New Update, Dasara Telugu Movie New Update, Dasara Movie, Dasara Latest Update, Dasara Movie Updates, Dasara Telugu Movie Live Updates, Dasara Telugu Movie Latest News, Dasara Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

కెరీర్ ప్రారంభంనుండి విభిన్నమైన పాత్రలు చేసే హీరోల్లో న్యాచురల్ స్టార్ హీరో నాని కూడా ముందుంటాడు. ఇక నాని కామెడీ యాంగిల్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కామెడీతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దిట్ట. అయితే నాని మాస్ రోల్ లో చాలా తక్కువ పాత్రలే చేశాడు. కానీ ఫస్ట్ టైమ్ ఫుల్ మాసీ రోల్ లో వస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా దసరా. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ప్రమోషన్స్ కూడా చిన్నగా మొదలు పెడుతున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే రెండు రోజుల క్రితం ఈసినిమా ఫస్ట్ సింగిల్ అప్ డేట్ ఇచ్చాడు నాని. ఈసినిమా నుండి ధూమ్ ధామ్ దోస్తానా అనే మాస్ సాంగ్ దసరాకు రాబోతున్నట్టు.. ఈపాట ఇంతకు ముందెన్నడూ చూడని మాసీ స్ట్రీస్ సాంగ్ గా ఉండబోతుందని చెప్పాడు. ఇక తాజాగా ఫస్ట్ సింగిల్ ని అక్టోబర్ 3వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈనేపథ్యంలో ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక పోస్టర్ ను చూస్తుంటే నాని ఫుల్ మాస్ రోల్ లో నెవర్ బిఫోర్ రోల్ ని ప్లే చేస్తున్నట్టు అర్థమవుతుంది.

కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 16 =