
ట్యాగ్ · 4 కథనాలు


'ఐయామ్ నెగిటివ్' అంటున్న మంచు లక్ష్మీ..!

మరోసారి ప్రగ్య జైస్వాల్ కు కరోనా ఎఫెక్ట్

సోనూసూద్ కీలక నిర్ణయం

"పుష్ప"మూవీ పోస్టర్ తో కేంద్ర ప్రభుత్వం ప్రచారం
నార్త్ లేదు సౌత్ లేదు అన్నట్లుగా “పుష్ప “మూవీ హవానడుస్తుంది. ” పుష్ప” మూవీ పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లు దృష్టి పెట్టి ,ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ను కచ్చితంగా ధరించాలనే నియమంపై కార్యక్రమం చేపట్టారు. “పుష్ప” సినిమాలో బైక్‌పై వెళుతున్న అల్లు అర్జున్ హెల్మెట్ ధరించి ఉన్నట్లుగా మార్ఫింగ్ చేసి హెల్మెట్ తప్పని సరి.. తగ్గేదే లే అంటూ రాసి ఉన్న ఫోటో ను సోషల్ మీడియా లో షేర్ చేసి హెల్మెట్ ధరించండి. అది మిమ్మల్ని కాపాడుతుంది. అంటూ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

'ఐయామ్ నెగిటివ్' అంటున్న మంచు లక్ష్మీ..!
కరోనా థర్డ్ వేవ్ ప్రభావం సినీ పరిశ్రమపై ఏ స్థాయిలో ఉందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ఈ కరోనా బారిన పడ్డారు. ఒకరు కాదు ఇద్దురు కాదు కరోనా బారిన పడిన సెలబ్రిటీల సంఖ్య చాలానే ఉంది. ఈ వారం రోజుల గ్యాప్ లోనే చాలా మంది తమకు కరోనా పాజిటివ్ అంటూ సోషల్ మీడియా వేదికగా తెలియచేశారు. ఇక ఈ కరోనా బారిన పడిన వారిలో మంచు లక్ష్మీ కూడా ఉన్న సంగతి తెలిసిందే. అంతకు ముందు మంచు మనోజ్, ఆ తర్వాత అదే ఫ్యామిలీ నుంచి మంచు లక్ష్మి కరోనా బారిన పడ్డారు. మంచు లక్ష్మీ స్వయంగా ఈవిషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. ఇక తాజాగా మంచు లక్ష్మీ కరోనా నుండి కోలుకుంది. ఈవిషయాన్ని తన ఇన్ట్సా ద్వారా…

మరోసారి ప్రగ్య జైస్వాల్ కు కరోనా ఎఫెక్ట్
తెలుగు ,తమిళ భాషల “విరాట్టు “మూవీ తో మోడల్ ప్రగ్య జైస్వాల్ టాలీవుడ్ , కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు.“కంచె “, “గుంటూరోడు “, “జయ జానకి నాయక “వంటి మూవీస్ లో ప్రగ్య జైస్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “కురుక్షేత్ర ” మూవీ తో కన్నడ చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు. బాలీవుడ్ మూవీ “అంతిమ్ :ది ఫైనల్ ట్రూత్ ” లో ప్రగ్య కథానాయికగా నటిస్తున్నారు. ప్రగ్య జైస్వాల్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “అఖండ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

సోనూసూద్ కీలక నిర్ణయం
దేశంలో కరోనా విలయతాండవం ఆడుతుంది . నిత్యం లక్షల్లో కేసులు నమోదవుతుండటం, వేలల్లో మరణాలు సంభవించడం ప్రజలలో ఆందోళన కలిగిస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. మరికొన్ని రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్ పాటిస్తూ కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ మహమ్మారి వైరస్ వ్యాప్తి కొనసాగుతూ జనాన్ని బలి తీసుకుంటోంది. ఫస్ట్ వేవ్‌తో పోల్చితే సెకండ్ వేవ్ ఉదృతి ఎక్కువగా ఉంది. సెకండ్ వేవ్ విజృంభణ తో హాస్పిటల్స్‌లో బెడ్స్, ఆక్సీజన్ దొరకక అన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.