
ట్యాగ్ · 4 కథనాలు


సూర్య డెసిషన్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

విదేశాలకు నిఖిల్ 'కార్తికేయ2'

యూరోప్ , వియత్నాం లలో "దైవం మనుష్య రూపేణా "

గీతా ఆర్ట్స్ అప్ కమింగ్ మూవీస్ అప్డేట్
రీసెంట్ గా తెలుగు లో విడుదలై బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది మలయాళం మూవీ 2018.ఆరు రోజుల్లో ఈసినిమా 6కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.తెలుగులో ఈసినిమాను బన్నీ వాస్ రిలీజ్ చేశాడు. ఇక సినిమా సక్సెస్ అవ్వడంతో ఈరోజు సక్సెస్ మీట్ నిర్వహించారు.ఈమీట్ కు ప్రముఖ నిర్మాత ,గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా తమ బ్యానర్ నుండి రానున్న సినిమాల గురించి అల్లు అరవింద్ వాఖ్యానించారు.

సూర్య డెసిషన్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
తమిళ్ స్టార్ హీరోలు విజయ్, అజిత్, ధనుష్, సూర్య ఇంకా చాలామందికి తెలుగులో స్పెషల్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. వారి నటనతో తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఇన్నాళ్లు డబ్బింగ్ లతో అలరించిన వీరు ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులోనే తీయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే ధనుష్ సార్ సినిమాతో డైరెక్ట్ తెలుగు సినిమా తీసి హిట్ ను సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు సూర్య ఫ్యాన్స్ కోసం సూర్య డైరెక్ట్ తెలుగు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపై కూడా ఎప్పటి నుండో చర్చలు జరుగుతున్నాయి కూడా.

విదేశాలకు నిఖిల్ 'కార్తికేయ2'
యంగ్ హీరో నిఖిల్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ 18 పేజీస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ అవ్వగా అవి డిఫరెంట్ గా ఉండి ఆకట్టుకున్నాయి. సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రానున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్న ఈసినిమాకు.. సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.

యూరోప్ , వియత్నాం లలో "దైవం మనుష్య రూపేణా "
విభిన్న కథా చిత్ర దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ , స్వాతి జంటగా రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ "కార్తికేయ "ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై చందు మొండేటి దర్శకత్వంలో హీరో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా "కార్తికేయ "మూవీ సీక్వెల్ "కార్తికేయ 2 "తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో షూటింగ్ జరుపుకున్న "కార్తికేయ 2 " మూవీ ఆగస్ట్ నుండి యూరప్, వియత్నాం వంటి దేశాల్లో చిత్రీకరణ కు దర్శకుడు ప్లాన్ చేశారు.