ట్యాగ్ · 4 కథనాలు
ఆనందంలో షిర్లీ సేతియా
నాగశౌర్య కు జోడీగా సంచలన గాయని షర్లీ సేతియా
హీరో నాగశౌర్య కు జోడీగా షిర్లీ సెషియా
అల్లు అర్జున్ కు పెద్ద అభిమానిని - షిర్లీ సెటియా
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్…
ఆనందంలో షిర్లీ సేతియా
యంగ్ హీరో నాగశౌర్య పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పూజా కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నాగశౌర్య కు జోడీగా సింగర్ , యాక్ట్రెస్ షిర్లీ సేతియా ఎంపిక అయ్యారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్ళనుంది. హీరో నాగశౌర్య ప్రస్తుతం "#NS20 ", "వరుడు కావలెను " మూవీస్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.
నాగశౌర్య కు జోడీగా సంచలన గాయని షర్లీ సేతియా
ప్రస్తుతం సుబ్రహ్మణ్యపురం ఫేమ్ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తో కలిసి నాగ శౌర్య 20 వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.పురాతన క్రీడ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దీనితో పాటుసితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో.. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ లో కె.పి.రాజేంద్ర దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతుంది.
హీరో నాగశౌర్య కు జోడీగా షిర్లీ సెషియా
హీరో నాగశౌర్య ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో విలు విద్య నేపథ్యం లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "#NS20 "మూవీ లో నటిస్తున్నారు. కేతిక శర్మ కథానాయిక. ఈ మూవీ తో పాటు సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "#NS21"మూవీ హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ రెండు మూవీస్ ఏక కాలంలో తెరకెక్కుతున్నాయి. ఈ మూవీ లో రీతూ వర్మ కథానాయిక.