ట్యాగ్ · 64 కథనాలు · పేజీ 4
'నాగ్' బ్యాక్ టు షూట్ - కెమెరా..యాక్షన్..!
బిగ్‌బాస్ సీజన్ 4 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూడు సీజన్లతో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆదరణ పొందిన ఈ షో ఇప్పుడు నాలుగో సీజన్ కోసం సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో కింగ్ నాగ్ కంటెస్టెంట్ లను ఒక ఆట ఆడించేందుకు రెడీ అవుతున్నాడు. బిగ్ బాస్4 ప్రోమో కోసం నాగ్ షూటింగ్ లో పాల్గొన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయాన్ని నాగ్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇక దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున తాజాగా షేర్ చేశాడు. బ్యాక్ టు ఫ్లోర్.. లైట్స్, కెమెరా, యాక్షన్ వావ్ వావ్ వావ్ అంటూ ట్వీట్ చేసాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కెకె సెంథిల్ ఆధ్వర్యంలో షూటింగ్ జరుగుతోందట…
'బిగ్ బాస్ 4' షూటింగ్ మొదలుపెట్టిన నాగార్జున..!
అసలే లాక్ డౌన్.. అందరూ ఇంట్లోనే ఉన్నారు.. ఇక షూటింగ్స్ లేవు కాబట్టి ఇన్ని రోజులు సీరియల్స్.. ప్రోగ్రామ్స్ కు బ్రేక్ పడింది. ఇప్పుడిప్పుడే చిన్నగా షూటింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బిగ్ బాస్ షూటింగ్ కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. నిజానికి కరోనా వల్ల ఈ యేడాది ఎప్పుడో మొదలవ్వాల్సిన బిగ్‌బాస్ సీజన్ 4 కాస్త ఆలస్యం అయింది. లేట్ అయినా.. లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు బిగ్ బాస్ సిబ్బంది సిద్దమవుతున్నారట.
బిగ్ బాస్ రూమర్స్ పై క్లారిటీ - నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు..!
త్వరలో బిగ్ బాస్ సీజన్4 మొదలు కానున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ఎప్పుడైతే షో మొదలైందో అప్పటినుండి పలువురు హీరోల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే యంగ్ హీరో కార్తికేయ తాను నటించడం లేదంటూ క్లారిటీ ఇచ్చేసాడు. ఇక ఇప్పుడు మరో హీరోకూడా తనపై వస్తున్న రూమర్లపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు. ఆ హీరో ఎవరో కాదు తరుణ్. తరుణ్ సీజన్ 4లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు అంటూ చాలా రోజులనుండే వార్తలు అందుకున్నాయి.
బిగ్ బాస్ సీజన్ 4 కు నాగార్జున వ్యాఖ్యాత ?
స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో 3సీజన్ లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకొన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 4కు వ్యాఖ్యాతగా పలువురు పేర్లు వినిపించాయి. ఎటువంటి కాంట్రవర్సీటీ లు లేకుండా బిగ్ బాస్ సీజన్ 3 ను హుందాగా, జోవియల్ గా నడిపించిన నాగార్జున బిగ్ బాస్ సీజన్ 4 కు వ్యాఖ్యాత గా ఉంటారని సమాచారం.