
ట్యాగ్ · 4 కథనాలు


"భవదీయుడు భగత్ సింగ్ " మూవీ లేటెస్ట్ అప్ డేట్

లొకేషన్స్ వేటలో 'భవదీయుడు భగత్ సింగ్' టీమ్

పవర్ స్టార్ కు జోడీగా బుట్టబొమ్మ..!

'భవదీయుడు భగత్ సింగ్.. పవన్ రోల్ పై క్లారిటీ..!
రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ముందు వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వగా ఆసినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. ఆ తరువాత సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో వచ్చిన సినిమా భీమ్లానాయక్ తో మరో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకొని రెండో హిట్ ను కూడా అందుకున్నాడు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నది హ్యాట్రిక్ కోసం. ప్రస్తుతం అయితే పవన్ హరిహర వీరమల్లు సినిమాతో బిజీగా ఉన్నాడు. గత కొంతకాలంగా పలు కారణాల వల్ల ఈసినిమా షూట్ కు బ్రేక్ పడగా రీసెంట్ గానే మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేసి శరవేగంగా షూటింగ్ ను జరుపుతున్నారు.

"భవదీయుడు భగత్ సింగ్ " మూవీ లేటెస్ట్ అప్ డేట్
బ్లాక్ బస్టర్ “వకీల్ సాబ్ “మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చి , బ్లాక్ బస్టర్ “భీమ్లా నాయక్” మూవీ లో తన పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” పాన్ ఇండియా మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.హరీష్ శంకర్ దర్శకత్వంలో ”భవదీయుడు భగత్ సింగ్ “మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

లొకేషన్స్ వేటలో 'భవదీయుడు భగత్ సింగ్' టీమ్
రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ముందు వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వగా ఆసినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దంగా చేస్తున్నాడు. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో వస్తున్న సినిమా భీమ్లా నాయక్. ఈసినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈసినిమాను సితార ఎంటర్‌టైనర్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

పవర్ స్టార్ కు జోడీగా బుట్టబొమ్మ..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భీమ్లానాయక్ సినిమాతో బిజీగా ఉండగా త్వరలోనే క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు అనే సినిమా షూటింగ్ కూడా రీస్టార్ట్ చేయనున్నాడు. ఇక ఈ సినిమాల తరువాత పవన్ హరీష్ శంకర్ తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈసినిమా సెట్స్ పైకి వెళ్లకముందే అప్పుడే టైటిల్ ను దానితో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ ఫస్ట్ లుక్ కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. అంతేకాకుండా ఈసినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు.. అలాగే పవన్ కోసం సాలిడ్ కథను పూర్తి చేసే పనిలో పడ్డాడు…