
ట్యాగ్ · 4 కథనాలు


మాస్ పోలీస్ , ఫ్యాక్షనిస్ట్ గా బాలకృష్ణ

మరో నెగటివ్ రోల్ లో వరలక్ష్మీ శరత్ కుమార్ ?

#NBK108 మూవీ లో హీరో బాలకృష్ణ కు జోడీగా కాజల్ అగర్వాల్
అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో రెండు భారీ సక్సెస్ లు సొంతం చేసుకుని ఉల్ జోష్ లో ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం షైన్ క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న #NBK108 మూవీలో ఒక పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. యువ మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

10 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్న "#NBK107" మూవీ ఫస్ట్ హంట్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

మాస్ పోలీస్ , ఫ్యాక్షనిస్ట్ గా బాలకృష్ణ
హీరో బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ "అఖండ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. "అఖండ" మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ , టీజర్ లకు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది. "అఖండ "మూవీ తరువాత మలినేని గోపీచంద్ దర్శకత్వంలో రూపొందే ఒక మూవీ కి హీరో బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మరో నెగటివ్ రోల్ లో వరలక్ష్మీ శరత్ కుమార్ ?
"పోడా పోడి "మూవీ తో కథానాయికగా కోలీవుడ్ కు పరిచయం అయిన వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళ , కన్నడ , మలయాళ భాషా సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. పలు తమిళ మూవీస్ లో నెగటివ్ రోల్స్ లో నటించిన వరలక్ష్మి "తెనాలి రామకృష్ణ బి ఎ బి ఎల్ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సూపర్ హిట్ "నాంది ", "క్రాక్ "మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. వరలక్ష్మి ప్రస్తుతం 5తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.