ట్యాగ్ · 5 కథనాలు
మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ లో అనుష్క ?
అనుష్క కి జనవరి సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?
మరో వైవిధ్యభరిత పాత్రలో అనుష్క

కొత్త మూవీ షూటింగ్ కు రెడీ
ఎవరూ పర్‌ఫెక్ట్ కాదు..!
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ భావోద్వేగ పోస్ట్ చేసింది. "మనందరం జీవితంలోని సమస్యలను మనకు తెలిసిన విధంగా పరిష్కరించుకుంటాం. ఎవరూ పర్‌ఫెక్ట్ కాదు. ఇది మంచి మార్గం, ఇది చెడు మార్గం అంటూ లేవు. మనమెవరం రోడ్ మ్యాప్‌తో పుట్టలేదు. మనందరం పెద్దవో, చిన్నవో బాధలు పడుతుంటాం. కొందరు లోపలే కుమిలిపోతారు. కొందరు సాయం కోసం ఏడుస్తారు. కొందరు నిస్సహాయంగా ఉంటారు. ఇకపై మనం ఇంకా దయతో జీవిద్దాం. ఇతరుల మాటలను విందాం. వారిని ప్రేమిద్దాం. మనమంతా కలిసి ఇంకా ఉత్తమంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. మనం ఇప్పటికప్పుడు ప్రతి…
మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ లో అనుష్క ?
సక్సెస్ ఫుల్ "సూపర్ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుష్క 15 సంవత్సరాలుగా తెలుగు , తమిళ ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. అరుంధతి , సరోజ , రుద్రమదేవి , దేవసేన, భాగమతి క్యారెక్టర్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన థ్రిల్లర్ మూవీ "నిశ్శబ్ధం " విడుదలకు సిద్ధంగా ఉంది . "అరుంధతి ", "వేదం" ,"ఢమరుకం ", "రుద్రమదేవి "," బాహుబలి 2", "భాగమతి " మూవీస్ కు అనుష్క బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు.
అనుష్క కి జనవరి సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?
`అరుంధతి`తో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కి శ్రీకారం చుట్టింది అనుష్క. మొదటి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది కూడా. ఆపై`పంచాక్షరి, వర్ణ, రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి` వంటి నాయికా ప్రాధాన్య చిత్రాలతో పలకరించిన స్వీటీకి... వీటిలో `భాగమతి` మినహా మరే సినిమా విజయాన్ని ఇవ్వలేకపోయింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే... `అరుంధతి`, `భాగమతి`... ఈ రెండు చిత్రాలు కూడా వేర్వేరు సంవత్సరాల్లో జనవరి నెలలోనే రిలీజయ్యాయి.
మరో వైవిధ్యభరిత పాత్రలో అనుష్క
నాయికా ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు చిరునామాగా నిలుస్తూ... ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయిక అనుష్క. ‘భాగమతి’ తరువాత స్వల్ప విరామం తీసుకున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రస్... ప్రస్తుతం ‘సైలెన్స్’ అనే మల్టిలింగ్వల్ మూవీలో నటిస్తోంది. తెలుగులో ‘నిశ్శబ్దం’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీ, ఆంగ్ల భాషల్లో కూడా విడుదల కానుంది. మాధవన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి... హేమంత్ మధుకర్ (‘వస్తాడు నారాజు’ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నాడు.

కొత్త మూవీ షూటింగ్ కు రెడీ
తెలుగు, తమిళ భాషలలో అగ్ర తారగా వెలుగొందుతున్న అనుష్క నటించిన భాగమతి మూవీ 2018 జనవరిలో రిలీజయి రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సూపర్ హిట్ మూవీ తరువాత అనుష్క ఏ మూవీ లోను నటించలేదు. ఇప్పుడు ఒక కొత్త మూవీ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.