ట్యాగ్ · 4 కథనాలు
హీరో ప్రభాస్, అనుష్క ల పెళ్ళి ఫోటో ?
తెలుగు, తమిళ బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అనుష్క స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ "నిశ్శబ్ధం " మూవీ లో అద్భుతంగా నటించి అనుష్క ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్టార్ హీరోయిన్ అనుష్క సోషల్ మీడియా ట్విట్టర్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. తనకు సంబంధించిన అప్ డేట్స్ ను అనుష్క అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు అనుష్క ట్విట్టర్ ద్వారా జవాబిచ్చారు.
యోగా మంచిదే - అనుష్క
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన థ్రిల్లర్ "నిశ్శబ్ధం "మూవీ అక్టోబర్ 2 వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తం గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించిన "నిశ్శబ్ధం "మూవీ పూర్తిగా US లో రియల్ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకొనడం విశేషం. "నిశ్శబ్ధం "మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అనుష్క ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.

మరో యాక్షన్ కథకు గ్రీన్ సిగ్నల్..!
లేడీ ఓరియెంటెండ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే మొదట వినిపించే పేరు అనుష్క. అరుంధతి నుండి ఇప్పటివరకూ పలు లేడీ [ప్రాధాన్యత వున్న సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అనుష్క హేమంత్ మధుకర్ దర్శకత్వంలో `నిశ్శబ్దం` అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను జనవరి 31న రిలీజ్ చేయనున్నారు.
మిలటరీ బ్యాక్ డ్రాప్ లో అనుష్క యాక్షన్ థ్రిల్లర్?
ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న కథానాయికల్లో అనుష్క ఒకరు. `అరుంధతి` నుంచి `భాగమతి` వరకు పలు నాయికా ప్రాధాన్య చిత్రాల్లో అలరించింది స్వీటీ. తన కొత్త చిత్రం `నిశ్శబ్దం` కూడా ఇదే బాటలో వెళ్ళనుంది. నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ థ్రిల్లర్ మూవీ జనవరి 31న రిలీజ్ కానుంది.