
ట్యాగ్ · 4 కథనాలు


ఏఎన్నార్ శతజయంతి వేడుకలు.. చైతూ కీలక ప్రకటన

అక్కినేనికి శిరసు వంచి కృతజ్ఞతలు తెలుపుదాం - బాలకృష్ణ
అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. నేటినుంచి రెండు రోజులపాటు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు అక్కినేని కుటుంబ సభ్యులు. ఈ నేపథ్యంలో అక్కినేనికి టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్కినేనిని తలచుకుంటూ ఆయన ఓ ప్రెస్ నోట్ విడుదలచేశారు.

ఏఎన్నార్ 100.. స్పెషల్ స్క్రీనింగ్ మూవీస్ లిస్ట్ ఇదే!
తెలుగు చలనచిత్ర రంగంలోని తొలితరం నటుడు, స్టార్ హీరో, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్). 250కి పైగా చిత్రాలలో నటించిన ఆయన కొన్ని దశాబ్దాలపాటు తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఏఎన్నార్ ఇప్పుడు మన మధ్యన లేకపోయినా తాను నటించిన చిత్రాల ద్వారా, కళామతల్లికి ఆయన అందించిన సేవలద్వారా ఎల్లప్పుడూ ప్రజల స్మృతిపథంలో మెదులుతూనే ఉంటారు.

ఏఎన్నార్ శతజయంతి వేడుకలు.. చైతూ కీలక ప్రకటన
తెలుగు చలనచిత్ర రంగంలోని తొలితరం నటుల్లో అగ్రతారలుగా వెలుగొందినవారిలో ఒకరు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కాగా.. మరొకరు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్). ఇరువురూ 250కి పైగా చిత్రాల్లో నటించి దశాబ్దాలపాటు తెలుగు ప్రేక్షకులను అలరించారు. వీరిద్దరూ ఇప్పుడు మన మధ్యన లేకపోయినా వారు నటించిన చిత్రాల ద్వారా, కళామతల్లికి వారు అందించిన సేవలద్వారా ఎల్లప్పుడూ ప్రజల స్మృతిపథంలో మెదులుతూనే ఉంటారు.

ఏఎన్నార్ శతజయంతి ఉత్సవాలు.. మెగాస్టార్ ఘననివాళులు
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ఇద్దరు అగ్రహీరోలలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి నేడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనపై తనకు గల అభిమానాన్ని, గౌరవాన్ని తెలుపుతూ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ పోస్ట్ పంచుకున్నారు. అందులో.. "శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాను. ఆయన తెలుగు సినిమా కే కాదు భారతీయ సినీ చరిత్ర లోనే ఓ దిగ్గజ నటుడు" అని పేర్కొన్నారు.