
ట్యాగ్ · 4 కథనాలు


దీపావళికే కన్ఫామ్ చేసిన 'అన్నాత్తే'

దీపావళికే రజినీ 'అన్నాత్తే' ..!

'అన్నాత్తే' అనుకున్న డేట్ కే సినిమా రిలీజ్

సెన్సార్ పూర్తి చేసుకున్న 'అన్నాత్తే'
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కోసం తమిళ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసినిమాను తెలుగులో పెద్దన్న అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా ఈ విషయాన్ని పోస్టర్ తో ప్రకటించారు చిత్రయూనిట్. ఇక ఈసినిమా దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ చేసేశారు. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయిపోయింది. ఈ…

దీపావళికే కన్ఫామ్ చేసిన 'అన్నాత్తే'
శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా వస్తున్న సినిమా అన్నాత్తే. ఈసినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే షూట్ కు పలు సార్లు బ్రేక్ పడగా.. మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు. ఇక ఈసినిమాను దీపావళి కానుకగా నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే కరోనా వల్ల అది సాధ్యపడుతుందో లేదో అని అనుకున్నారు. దీంతో ఆమధ్య దీపావళికి సినిమా రిలీజ్ అవ్వడం కష్టమే అన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ మేకర్స్ మాత్రం ఖచ్చితంగా దీపావళికే రిలీజ్ చేస్తామని చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరోసారి దీపావళికే కన్ఫామ్ చేస్తూ ప్రకటించారు. నేడు ఈ…

దీపావళికే రజినీ 'అన్నాత్తే' ..!
శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా వస్తున్న సినిమా అన్నాత్తే. ఇక ఈసినిమా షూటింగ్ కు కూడా కరోనా వల్ల చాలా బ్రేకులే పడ్డాయి. ఇక ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టగా మళ్లీ సెకండ్ వేవ్ వచ్చింది. అన్నాత్తే టీమ్ మెంబర్స్ కరోనా బారిన పడటం.. మధ్యలో రజినీ కూడా అనారోగ్యం పాలవ్వడం వల్ల మధ్యలో కొన్ని రోజులు షూట్ కు బ్రేక్ పడింది. ఆతర్వాత మళ్లీ హైద్రాాబాద్ వచ్చి లాక్ డౌన్ పెట్టినా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని హైద్రాబాద్ లో షూటింగ్ ను పూర్తి చేశారు. ఇక ఇదిలా ఉండగాఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త నెమ్మదిస్తున్నాయి. ఈసినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయినట్టే. రజినీ దాదాపు తన పోర్షన్స్ ను పూర్తి చేసినట్టు…

'అన్నాత్తే' అనుకున్న డేట్ కే సినిమా రిలీజ్
గత ఏడాది నుండి కొన్ని సినిమాల షూటింగ్ లకు మాత్రం అస్సలు టైమ్ కలిసిరావట్లేదు. కరోనా పోయింది ఇక షూటింగ్ లు మొదలు పెట్టొచ్చు అనుకున్నారు కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ తో మళ్లీ బ్రేక్ పడింది. ఇప్పటికే ఎన్నో సినిమాల షూటింగ్ లకు బ్రేక్ పడగా.. ఇప్పుడు రజినీ అన్నాత్తే సినిమాకు కూడా బ్రేక్ పడింది. ఇటీవల రజనీ పూర్తిగా కోలుకోవడంతో తిరిగి షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం రాత్రిపూట కర్ప్యూ విధించింది.