
ట్యాగ్ · 7 కథనాలు


"పుష్ప "సెట్స్ లో అనసూయ
"పుష్ప "మూవీ టీజర్ మరో రికార్డ్

'పుష్ప'లో అలాంటిదే నా పాత్ర..!
'పుష్ప' బర్త్ డే పోస్టర్ రిలీజ్

మాస్ కా బాప్ అనిపిస్తున్న 'పుష్ప రాజ్'

'పుష్ప రాజ్' కు టైమ్ ఫిక్స్

"పుష్ప" మూవీ న్యూ మేకింగ్ వీడియో రిలీజ్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో , భారీ ఎత్తున రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో 200క్లబ్ దిశగా దూసుకుపోతోంది.“పుష్ప: ది రైజ్” మూవీ కలెక్షన్స్ US లో 2మిలియన్ డాలర్స్ చేరువలో ఉన్నాయి. రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ…

"పుష్ప "సెట్స్ లో అనసూయ
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక మందన్న జంటగా మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ”పుష్ప “మూవీ లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు .జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్, అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
"పుష్ప "మూవీ టీజర్ మరో రికార్డ్
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ”పుష్ప “మూవీ లో మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు .జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జూలై నెలలో "పుష్ప " మూవీ షూటింగ్ పునః ప్రారంభం కానుంది.

'పుష్ప'లో అలాంటిదే నా పాత్ర..!
అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో వస్తున్న పుష్ప సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తన మేకోవర్, కథ వీటితోపాటు క్యాస్టింగ్ లో కూడా పర్ఫెక్ట్ ప్లాన్ తో వెళుతున్నాడు సుకుమార్. ఇక ఈసినిమాలో అనసూయ కూడా ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తను పుష్ప షూటింగ్ లో కూడా జాయిన్ అయింది.
'పుష్ప' బర్త్ డే పోస్టర్ రిలీజ్
సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా పుష్ప. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక బన్నీ పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తుండగా ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ రోజు బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని నిన్ననే విడుదల చేశారు. ఈ టీజర్‌లో విజువల్స్‌తో పాటు.. యాక్షన్.. బ్యాక్‌గ్రాండ్ మ్యూజిక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా టీజర్‌లో అల్లు అర్జున్ చెప్పిన ‘తగ్గేదే లే’ అనే డైలాగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ టీజర్ య్యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

మాస్ కా బాప్ అనిపిస్తున్న 'పుష్ప రాజ్'
తగ్గేదేలే.. బన్నీ పుష్ప సినిమాలో వాడే ఊత పదం అని ఇప్పటికే చెప్పారు.. ఇక బన్నీ పుట్టినరోజు సందర్భంగా నిన్న రిలీజ్ చేసిన టీజర్ లో కూడా ఈ ఒక్క పదం మాత్రమే చూపించారు.. మరి టీజర్ చూసిన తరువాత నిజంగానే బన్నీ తగ్గేలా కనిపించడం లేదు. ఏదో పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్ర.. మేకోవర్ ఛేంజ్ చేశాడు కొత్తగా ఉంటుందేమో అనుకున్నారు కానీ టీజర్ చూసిన తరువాత బన్నీ మరో బ్లాక్ బస్టర్ కు రెడీ అవుతున్నాడు అన్న అభిప్రాయాలే వినిపిస్తున్నాయి.

'పుష్ప రాజ్' కు టైమ్ ఫిక్స్
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'పుష్ప'. శేషాచలం అడువుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో చిత్తూరు జిల్లా యాసలో ఇరగదీయనున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే మారేడు మిల్లి, రంపచోడవరం, టెన్ కాశీ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోగా.. తర్వాతి షెడ్యూల్‌ను చిత్తూరుతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని సత్య మంగళం అడవుల్లో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.