
ట్యాగ్ · 6 కథనాలు


తునివు-ప్రముఖ సంస్థకు తెలుగు హక్కులు

22 సంవత్సరాల తరువాత హీరో అజిత్ కు జోడీగా టబు

గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి అజిత్ స్టన్నింగ్ స్టిల్ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అజిత్ కుమార్‌ని మూడు డిఫరెంట్ఎక్స్‌ప్రెషన్స్‌లో ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

షూటింగ్‌లో అజిత్ రిస్కీ స్టంట్.. కారు ప్రమాదం వీడియో వైరల్
తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'విదా ముయార్చి'. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తుండగా.. స్టార్ హీరోయిన్ త్రిష కథనాయికగా నటిస్తోంది. ఏకే 62గా వ్యవహరిస్తోన్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో హీరో అజిత్ ఎలాంటి డూప్ లేకుండా రిస్కీ ఫీట్స్ చేస్తుండటం విశేషం. ఈ క్రమంలోనే ఆయన ఒకసారి ప్రమాదం బారిన కూడా పడ్డారు. తాజాగా ఇందుకు సంబంధించి ఈ చిత్రంలో ఆయన చేసిన ఒక స్టంట్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

అజిత్ తో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా టైటిల్ రిలీజ్
ఇప్పుడు తెలుగు మేకర్స్ తమిళ్ హీరోలతో, తమిళ్ హీరోలు తెలుగు మేకర్స్ తో సినిమాలు చేయడం కామన్ అయిపోయింది. ఇప్పటికే చాలా కాంబినేషన్స్ వచ్చాయి.. కొన్ని కాంబినేషన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అవ్వబోతుంది. ఆ కాంబినేషన్ ఏదో కాదు. తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ అయిన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఒక సినిమా రావడం. ఈసినిమాపై ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి కూడా విదితమే.

అజిత్ తునివు తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ టైటిల్ తెగింపు ?
జీ స్టూడియోస్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ ఎల్ పి బ్యానర్స్ పై సూపర్ హిట్ తీరన్ అధికారం ఒండ్రు మూవీ ఫేమ్ హెచ్ .వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కిన నెర్కొండ పార్వై, సేమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన వాలిమై తమిళ మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సూపర్ హిట్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ తునివు తమిళ మూవీ 2023 జనవరి 11 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మంజు వారియర్ కథానాయిక కాగా సముద్రఖని ముఖ్య పాత్రలో నటించారు. ఈ మూవీకి గిబ్రాన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తునివు-ప్రముఖ సంస్థకు తెలుగు హక్కులు
తమిళ్ స్టార్ హీరో అజిత్ మాత్రం సినిమా హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఒక సినిమా తరువాత ఒక సినిమాను చేసుకంటూ వెళిపోతున్నాడు. అంతేకాదు అజిత్ కు ఒక డైరెక్టర్ తో వర్క్ సెట్ అయితే అతనితో ఎన్నిసార్లు వర్క్ చేయడానికి అయినా రెడీ అయిపోతాడన్న విషయం తెలిసిందే కదా. ఆ విధంగానే గతంలో తమిళ్ దర్శకుడు శివ దర్శకత్వంలో అజిత్ ఏకంగా నాలుగు సినిమాలు తీశాడు. నాలుగు కూడా హిట్టయ్యాయి. ఇక ఇప్పుడు మరో దర్శకుడితో కూడా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఆ దర్శకుడు ఎవరో కాదు హెచ్. వినోద్. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. నెర్కొండ పార్వాయి సినిమా ఇంకోటి వాలిమై సినిమా. నెర్కొండ పార్వాయి సినిమా పింక్…

22 సంవత్సరాల తరువాత హీరో అజిత్ కు జోడీగా టబు
"హమ్ నౌజవాన్ "(1985 ) మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన టబు "కూలీ నెం . 1 "మూవీ తో కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "కాదల్ దేశం"మూవీ తో తమిళ , "కాలాపానీ "మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమకు టబు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ హిందీ, తమిళ, మలయాళ , ఇంగ్లీష్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు . అజిత్ హీరోగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ "కండుకొండెన్ కండుకొండెన్ "తమిళ మూవీ లో కథానాయికగా నటించిన టబు 22 సంవత్సరాల తరువాత "#THALA 61"మూవీ లో అజిత్ కు జోడీగా నటించనున్నారు.