కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actress Taapsee Next Project Details On Cards

ట్యాగ్ · 4 కథనాలు

షూటింగ్ అప్‌డేట్

షూటింగ్స్ తో తాప్సీ బిజీ

తెలుగు , తమిళ , మలయాళ భాషా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ తాప్సీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సూపర్ హిట్ "ఛష్మే బద్దూర్ " మూవీ తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన తాప్సీ బాలీవుడ్ లో బిజీగా మారారు. స్టార్ హీరోల మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో తాప్సీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తమిళ , హిందీ భాషల పలు మూవీస్ లో తాప్సీ నటిస్తున్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన మూవీ షూటింగ్స్ 6నెలల తరువాత ఒక్కొక్కటిగా ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఫాంటసీ డ్రామా మూవీ లో తాప్సీ

ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై దీపక్ సుందర్ రాజన్ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో ఒక ఫాంటసీ డ్రామా తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ లో తాప్సీతో పాటు విజయ్ సేతుపతి కూడా ద్విపాత్రాభినయం చేయడం విశేషం. రాజస్థాన్ జైపూర్ పరిసరాలలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ మూవీ కి "అన్నాబెల్లె సుబ్రమణ్యం" టైటిల్ పరిశీలనలో ఉంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తాప్సీ ద్విపాత్రాభినయం

"ఝుమ్మంది నాదం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ తాప్సీ తెలుగు , తమిళ భాషలలో పలు సూపర్ హిట్ చిత్రాలలో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ "ఛష్మే బద్దూర్ " మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయిన తాప్సీ సూపర్ హిట్ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాప్సీ ప్రస్తుతం "హసీనా దిల్ రుబా ", "శభాష్ మిథు "(హిందీ ), "జనగణమన " తమిళ మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Versatile Actress Taapsee Pannu Gives Green Once Again For A Tamil Movie
సినిమా వార్తలు

మరో తమిళ మూవీ కి తాప్సీ గ్రీన్ సిగ్నల్

రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ తాప్సీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో తాప్సీ బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. "హసీన్ దిల్ రుబా ", "శభాష్ మిథు " మూవీస్ లో తాప్సీ నటిస్తున్నారు. తాప్సీ ఇప్పుడు దక్షిణాది మూవీస్ పై ఫోకస్ పెట్టారు. జయం రవి హీరోగా రూపొందుతున్న "జనగణమన " మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయిన తాప్సీ మరో తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్

షేర్