
ట్యాగ్ · 4 కథనాలు


రైటర్ గా స్టార్ హీరోయిన్ శృతి హాసన్
అఫీషియల్.. 'సలార్' లో 'శృతి'
మహేష్ ఛాలెంజ్ పూర్తి చేసిన శ్రుతీహాసన్

ప్రభాస్ తో నటించడం అద్భుతం - శృతి హాసన్
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. “క్రాక్ “, “వకీల్ సాబ్ ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ “సలార్ “, బాలకృష్ణ “#NBK 107 “ ,మెగా స్టార్ చిరంజీవి “వాల్తేరు వీరయ్య ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. రెండు తమిళ మూవీస్ కు శృతి హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

రైటర్ గా స్టార్ హీరోయిన్ శృతి హాసన్
మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. శృతి కథానాయికగా రూపొందిన "క్రాక్ "మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. "విజయ్ సేతుపతి హీరోగా రూపొందిన "లాభం "తమిళ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన "వకీల్ సాబ్ " తెలుగు మూవీస్ షూటింగ్స్ ను శృతి కంప్లీట్ చేశారు. శృతి ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న "సలార్ "మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.
అఫీషియల్.. 'సలార్' లో 'శృతి'
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 'సలార్' సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాను ఇటీవలే గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలోని భారీ యాక్షన్ సన్నివేశాలను తెలంగాణా లోని గోదావరి ఖని లో ఉన్న సింగరేణి గనుల్లో తెరకెక్కించనున్నట్టు.. ఇప్పటికే కోల్ మైన్ వద్ద ఏర్పాట్లు కూడా ప్రారంభించినట్టు వార్తలు కూడా వస్తున్నాయి.
మహేష్ ఛాలెంజ్ పూర్తి చేసిన శ్రుతీహాసన్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. సినీ ప్రముఖులు భారీ స్థాయిలో పాల్గొంటున్నారు. అంతేకాదు మన తెలుగులో స్టార్ట్ అయిన ఈ ఛాలెంజ్ చిన్న చిన్నగా పక్కన ఇండస్ట్రీకి కూడా వెళ్తుంది. తన పుట్టినరోజున గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు విజయ్, శ్రుతీ హాసన్, ఎన్టీఆర్ కు ఛాలెంజ్ విసరగా ఇప్పటికే విజయ్ మహేష్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాడు. తాజాగా శ్రుతీహాసన్ కూడా మహేష్ ఛాలెంజ్ ను స్వీకరించింది. తాజాగా చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటింది.