
ట్యాగ్ · 4 కథనాలు


'మహాసముద్రం' - రంభకు అభిమానిగా జగ్గూభాయ్
హీరోయిన్ రంభ సెకండ్ ఇన్నింగ్స్

సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ..!

కారు ప్రమాదానికి గురైన రంభ ఫ్యామిలీ
టాలీవుడ్ నటి రంభ కారు ప్రమాదానికి గురైంది. తృటిలో ఆమె కుటుంబం ప్రమాదం నుండి తప్పించుకోగలిగింది. ఇక ఈవిషయాన్ని రంభ తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. పిల్లలను పాఠశాల నుంచి తీసుకువస్తుండగా.. దారి మధ్యలో మా కారును మరో కారు ఢీ కొట్టింది. ఆ సమయంలో కారులో నాతోపాటు పిల్లలు ఉన్నారు. చిన్న చిన్న గాయాలు అయ్యాయి. మేం అందరం సేఫ్‌గా ఉన్నాం. చిన్నారి షాషా ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మాకు బ్యాడ్‌టైమ్ నడుస్తోందనుకుంటా. షాషా త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి’’ అంటూ పోస్టు చేశారు.

'మహాసముద్రం' - రంభకు అభిమానిగా జగ్గూభాయ్
శర్వానంద్ హీరోగా, అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరో రేంజ్ అందుకున్న సిద్దార్థ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. కాగా ఈసినిమాలో జగపతిబాబు కూడా నటిస్తున్న సంగతి కూడా విదితమే. ఈ చిత్రంలో జగ్గూభాయ్ రంభకు అభిమానిగా కనిపిస్తాడు. వైజాగ్ లో వేసిన సెట్‌లో జగ్గూభాయ్ పై ఓ పాటను షూట్ చేయగా..ఈ సాంగ్‌లో రంభ ఫొటోలు, ప్లెక్సీలు కనిపిస్తాయి. ఈ పాటలో శర్వానంద్ కూడా ఉంటాడు.
హీరోయిన్ రంభ సెకండ్ ఇన్నింగ్స్
బ్లాక్ బస్టర్ "ఆ ఒక్కటీ అడక్కు " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రంభ "భైరవ ద్వీపం ", "అల్లుడా మజాకా ", "హిట్లర్ ", "బావగారు బాగున్నారా " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని , "హలో బ్రదర్ ", "దేశముదురు ", "యమదొంగ " వంటి సూపర్ హిట్ మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. తమిళ , కన్నడ , మలయాళ , హిందీ , బెంగాలీ , భోజ్ పురి బాషా చిత్రాలలో నటించి రంభ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణించారు.

సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ..!
ఒకప్పుడు స్టార్ హీరోల పక్కన స్టార్ హీరోయిన్లు గా వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లు ఎంతోమంది సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసందే. హీరోయిన్లుగా కాదులే కానీ ఈ జనరేషన్ లో స్టార్ హీరోల పక్కన ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఏదో పాత్ర దక్కింది చేస్తున్నాం అన్నట్టు కాకుండా.. దర్శకులు కూడా ఏదో వారిని తీసుకోవాలి.. పాత్ర ఇవ్వాలి అన్నట్టు కాకుండా.. సినిమాకే వాళ్ళు కీలక పాత్రలుగా చేస్తున్నారు. వాళ్ళ ద్వారానే సినిమా నడిచే పాత్రలను సృష్టిస్తున్నారు. ఉదాహరణకు రమ్యకృష్ణ, నదియా, విజయశాంతి, మీనా అలా పలువురు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి కీలకపాత్రలతో అలరిస్తున్నారు.