ట్యాగ్ · 4 కథనాలు

నవంబర్ లో "#VT 10" షూటింగ్ పునః ప్రారంభం
మీతో షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నా..!
చిన్నప్పటి 'గద్దలకొండ గణేష్' - 'రియల్' టు 'రీల్'
మిడ్ నైట్ షూట్ లో వరుణ్ తేజ్
ప్రస్తుతం వరుణ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఈ సినిమా కోసం ఒలింపిక్ విన్నర్ టోని జెఫ్రీస్ పర్యవేక్షణలో కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది.

నవంబర్ లో "#VT 10" షూటింగ్ పునః ప్రారంభం
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా , ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల వద్ద దర్శకత్వ శాఖ లో పనిచేసిన కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో, అల్లు వెంకటేష్ , సిద్ధు ముద్ద నిర్మాణ సారథ్యంలో బాక్సింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ "#VT 10" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న వరుణ్ తేజ్ కు జోడీ గా బాలీవుడ్ మూవీ "దబంగ్ 3 " ఫేమ్ సాయీ మంజ్రేకర్ నటిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , సునీల్ శెట్టి , జగపతి బాబు , నవీన్ చంద్ర , నదియా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
మీతో షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నా..!
ప్రస్తుతం వరుణ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.
చిన్నప్పటి 'గద్దలకొండ గణేష్' - 'రియల్' టు 'రీల్'
మెగా కాంపౌండ్ లో ఉన్న హీరోల్లో మెగా ప్రిన్స్ రూటు కాస్త సెపరేట్. మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. 'ముకుంద' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన వరుణ్ మొదట కొన్ని పరాజయాలే అందుకున్నాడు. ఇక ఫిదా సినిమాతో క్లాస్ హిట్ కొట్టిన వరుణ్... తొలిప్రేమ,ఎఫ్2 తో కామెడీ యాంగిల్ ను చూపించాడు..గద్దల కొండ గణేష్ సినిమాతో మాస్ హిట్ కొట్టాడు.