
ట్యాగ్ · 4 కథనాలు

క్రాక్ రీమేక్ ప్లాన్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో?
సౌత్ సినిమాలకు నార్త్ లో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఇక్కడ హిట్ అయిన సినిమాలను అక్కడ రీమేక్ చేయడానికి పోటీ పడుతున్నారు మేకర్స్. ఇప్పటికే ఎన్నో సినిమాలు నార్త్ లో రీమేక్ అయ్యాయి.. అవుతున్నాయి. ఇక ఇప్పుడు మరో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా రీమేక్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఆ బ్లాక్ బస్టర్ మరేదో కాదు క్రాక్ సినిమా. యదార్ధ సంఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని-రవితేజ కాంబినేషన్ లో వచ్చిన సినిమా క్రాక్. అప్పటికే వరుస ఫ్లాప్స్ తో ఉన్న రవితేజకు ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. అంతేకాదు కలెక్షన్ల విషయంలో కూడా ఎక్కడా రాజీపడకుండా సాలిడ్ కలెక్షన్స్ అందించింది.

'83' టీజర్ రిలీజ్
కబీర్ సింగ్ దర్శకత్వంలో.. రణ్ వీర్ సింగ్ హీరోగా టీం ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్‌ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ‘‘83’’ అనే టైటిలోతో ఈను సినిమా వస్తుంది. కపిల్ దేవ్ జీవితం,1983 ప్రపంచకప్ విజయం తదితర అంశాల ఆధారంగా సినిమా రూపొందుతుంది. ఇక ఈసినిమా కూడా ఎప్పు డో రిలీజ్ కావాల్సింది కానీ కరోనా వల్ల రిలీజ్ కు బ్రేక్ పడింది. ఫైనల్ గా డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్నారు. దీంతో ప్రమోషన్స్ స్టార్స్ చేశారు.

రణ్వీర్ తో 'అపరిచితుడు' రీమేక్
సౌత్ సినిమాలు ఇప్పుడు చాలానే హిందీలో రీమేక్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు మరో ఎవర్ గ్రీన్ సినిమాకూడా రీమేక్ అవ్వడానికి సిద్దంగా ఉంది. శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వచ్చిన సినిమా అపరిచితుడు ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. అవినీతి అంటే ఇష్టపడని పాత్రలో స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వ్యక్తిగా మూడు పాత్రల్లో అద్భుతంగా నటించిన చియాన్ విక్రమ్ నటనకు పట్టాం కట్టారు అందరూ. ఇక ఇప్పుడు ఈసినిమాను హిందీలో కూడా రీమేక్ చేయనున్నాడు శంకర్. ఈవిషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.

బాలీవుడ్ రీమేక్ "ఇస్మార్ట్ శంకర్" లో రణవీర్ సింగ్ ?
పూరి కనెక్ట్స్ , పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నిధి అగర్వాల్ , నభా నటేష్ కథానాయికలు. మణిశర్మ సంగీతం అందించారు. మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన "ఇస్మార్ట్ శంకర్ " మూవీ లో హీరో రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచింది. పక్కా తెలంగాణ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.