ట్యాగ్ · 5 కథనాలు
మామతో అల్లుడు - ఫ్యాన్ బాయ్ మూమెంట్
కుటుంబ కథా చిత్రం "పండంటి కాపురం"
సౌత్ ఇండియన్ ఫస్ట్ సినిమాస్కోప్ మూవీ
50 వసంతాల "కౌబాయ్"
పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై కె ఎస్ ఆర్ దాస్ దర్శకత్వంలో కృష్ణ , విజయ నిర్మల జంటగా ఇంగ్లీష్ మూవీస్ ఇన్ స్పి రేషన్ తో రూపొందిన "మోసగాళ్ళకు మోసగాడు "మూవీ 1971 సంవత్సరం ఆగష్టు 27 వ తేదీ రిలీజ్ అయ్యి విజయం సాధించింది . తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఫస్ట్ కౌ బాయ్ మూవీ , ఫస్ట్ కలర్ ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. నాగభూషణం , గుమ్మడి , కైకాల , ప్రభాకరరెడ్డి ముఖ్య పాత్రలలో నటించారు. పి. ఆదినారాయణ రావు సంగీతం అందించారు. ఈ మూవీ డబ్బింగ్ వెర్షన్స్ ఇంగ్లిష్ , హిందీ , తమిళ భాషలలో రిలీజ్ అయ్యాయి.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన సూపర్ స్టార్ కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. సాహసాలకు మారు పేరు కృష్ణ. ప్రయోగాత్మక సినిమాలు తీయాలంటే ఆయన తరువాతే. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ రాజ్యమేలుతున్న వేళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కృష్ణ తనదైన మార్గం నిర్దేశించుకున్నారు. ఒకరు జానపదం మరొకరు పౌరాణికాలకు పెట్టింది పేరుగా ముందుకు సాగుతున్న వేళ.. సాంఘిక చిత్రాలకు కేరాఫ్ గా మారారు కృష్ణ. అందులోనూ విత్ యాక్షన్ అంటే.. నిర్మాతలు దర్శకులకు ప్రముఖంగా సూపర్ స్టార్ కనిపించేవారు. తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ చేసిన ప్రయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల గురించి కాస్త పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. తెలుగు వెండి…
మామతో అల్లుడు - ఫ్యాన్ బాయ్ మూమెంట్
ఎంత హీరోలు అయినా కూడా వాళ్లకి కూడా ఎవరో ఒకరు ఫెవరెట్ ఉంటారు. ఇప్పుడు అలాంటి ఫ్యాన్ బాయ్ మూమెంట్ ను ఎంజాయ్ చేస్తున్నాడు సుధీర్ బాబు. అసలు సంగతేంటంటే.. ఈరోజు తన ట్విట్టర్ లో ఒక ఫొటో పోస్ట్ చేశాడు. కృష్ణ అక్కడ కుర్చీపై కూర్చుంటే.. కింద సుధీర్ బాబు సిగ్గు పడుతూ కూర్చున్నాడు. దానికి సుధీర్ బాబు.. చాలా ఏళ్లుగా ఆయన్ని దగ్గరిగా చూస్తున్నా.. అయితే ఆయనతో ఉన్న ప్రతిక్షణం ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ లా అనిపిస్తుంటుంది అని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇప్పుడు ఈఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కుటుంబ కథా చిత్రం "పండంటి కాపురం"
జయప్రద పిక్చర్స్ బ్యానర్ పై లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ , విజయ నిర్మల జంటగా కుటుంబ సంబంధాల నేపథ్యంలో అన్నదమ్ముల కథగా రూపొందిన "పండంటికాపురం "(1972 ) మూవీ ఘనవిజయంసాధించి ప్రేక్షకాదరణ పొందింది. ఎస్ వి రంగారావు , గుమ్మడి , ప్రభాకర్ రెడ్డి , దేవిక , జమున , బి. సరోజాదేవి , అల్లు రామలింగయ్య , రాజ బాబు వంటి నటీనటులతో రూపొందిన "పండంటి కాపురం" బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. ఎస్ పి కోదండపాణి స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
సౌత్ ఇండియన్ ఫస్ట్ సినిమాస్కోప్ మూవీ
పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ పై వి. రామచంద్ర రావు దర్శకత్వంలో హీరో కృష్ణ కథానాయకుడిగా బ్రిటిష్ సామ్రాజ్యం పై పోరాటం జరిపిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ "అల్లూరి సీతారామరాజు " 1974 సంవత్సరం మే 1 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. విజయ నిర్మల , జగ్గయ్య , చంద్ర మోహన్ , కాంతారావు , బాలయ్య , ప్రభాకర్ రెడ్డి ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ కి పి. ఆదినారాయణ రావు సంగీతం అందించారు.