
ట్యాగ్ · 4 కథనాలు


'ఆచార్య' రూమర్లను కొట్టిపారేసిన కొరటాల

'ఆచార్య' మెయిన్ ఎమోషన్ చరణ్ దే

"ఆచార్య "కొత్త పోస్టర్ రిలీజ్

"ఆచార్య "కు 20డేస్ వర్క్ బ్యాలెన్స్
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో “ఆచార్య “మూవీ తెరకెక్కుతుంది . ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ “లాహే లాహే “ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టెంపుల్ టౌన్ సెట్ , రామ్ చరణ్ , పూజాహెగ్డే ల సాంగ్ “ఆచార్య “మూవీకి హైలైట్ కానున్నాయి.

'ఆచార్య' రూమర్లను కొట్టిపారేసిన కొరటాల
మెగాస్టార్ చిరు- తనయుడు రామ్ చరణ్ ఇద్దరూ కలిసి వస్తున్న సినిమా ఆచార్య. అప్పుడెప్పుడో ‘మగధీర’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చిన్న క్యామియో రోల్ చేశాడు. ఆ తరువాత ఒకపాటలో కలిసి చిందేశారు. అది తప్పితే ఈ తండ్రీ కొడుకులిద్దరూ ఇప్పటిదాకా కలిసి నటించింది లేదు. కానీ ఇప్పుడు ‘ఆచార్య’ లో మాత్రం కీలక పాత్రలో నటిస్తున్నాడు చరణ్. దీంతో ఈ సినిమా కోసం ఈ కాంబినేషన్ ను సిల్వర్ స్క్రీన్ పై చూడాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

'ఆచార్య' మెయిన్ ఎమోషన్ చరణ్ దే
మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య. ఈసినిమా షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. ఇక ఇప్పుడు ఈసినిమాను మే13న రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ ఇంకా షూటింగే పూర్తి కాలేదు.. మే 13న రావడం కష్టమే. దానికితోడు కరోనా రావడంతో సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు కూడా. ఈ కరోనా తగ్గితే మళ్లీ షూటింగ్ ను ప్రారంభిస్తారు.

"ఆచార్య "కొత్త పోస్టర్ రిలీజ్
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “ఆచార్య “మూవీ మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధ , పూజాహెగ్డే నీలాంబరి గా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.