
ట్యాగ్ · 4 కథనాలు


అహింస ట్రైలర్ రిలీజ్

అభిరామ్ కు విలన్ గా సముద్ర ఖని..!

డెబ్యూకి రెడీ అయిన అభిరామ్

అహింస రిలీజ్ డేట్ ఫిక్స్
దగ్గుబాటి ఫ్యామిలీ నుండి వస్తున్న మరో సినిమా అభిరామ్. తెలుగు ఇండస్ట్రీలోనే టాప్ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు తనయుడు.. రానా తమ్ముడు అభిరామ్ అవ్వడంతో తన ఎంట్రీ పై అందరికీ ఆసక్తి ఉంది. తేజ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా వస్తున్న సినిమా అహింస. ఇక ఇప్పటికే విడుదలైన అభిరామ్ ప్రీ లుక్ పోస్టర్ దగ్గర నుండి టీజర్ వరకూ వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై ఆసక్తిని పెంచింది. అయితే ఈసినిమా ప్రమోషన్స్ ను అయితే చేస్తున్నారు కానీ రిలీజ్ డేట్ మాత్రం ఇంతవరకూ చెప్పలేదు. తాజాగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈసినిమా ను జూన్ 2వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

అహింస ట్రైలర్ రిలీజ్
దగ్గుబాటి ఫ్యామిలీ నుండి ఈతరం నటుల్లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోరానా. ఇక రానా ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఇదే ఫ్యామిలీ నుండి మరో హీరో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు సురేష్ బాబు రెండో తనయుడు, రానా తమ్ముడు అభిరామ్. తేజ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా వస్తున్న సినిమా అహింస. ఈసినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, అలానే టీజర్ ఈసినిమాపై అంచనాలను పెంచేసింది. వాటిని బట్టి సస్పెన్స్ థ్రిల్లర్ లాగ ఈసినిమా రానుందని…

అభిరామ్ కు విలన్ గా సముద్ర ఖని..!
తన నటనతో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని ఇప్పుడు తెలుగులో వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. అల వైకుంఠపురములో, ఇటీవల విడుదలైన రవితేజ క్రాక్ సినిమాలు సముద్రఖని మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం సముద్ర ఖని చేతిలో భారీ సినిమాలే ఉన్నాయి. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమా.. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో సముద్రఖని విలన్ గా నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు విలన్ గా ఆయనే దాదాపు ఖరారైనట్టే అని తెలుస్తుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి చిత్రంలోనూ సముద్రఖని నటించనున్నట్లు సమాచారం.

డెబ్యూకి రెడీ అయిన అభిరామ్
దగ్గుబాటి కుటుంబం నుండి ఇప్పటికే రెండో తరం హీరోగా రానా కెరీర్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే కదా. వైవిధ్యమైన సినిమాలు, పాత్రలను చేసే హీరోగా ఇప్పటికే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఇదే ఫ్యామిలీ నుండి రానా తమ్ముడు అభిరామ్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అభిరామ్ ఎంట్రీ ఇస్తున్నాడని ఇప్పుడు కాదు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. అభిని హీరోని చేసే బాధ్యత సురేష్ బాబు… తేజకు అప్పగించాడు. ఈ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుందని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఆగష్ట్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్…