
ట్యాగ్ · 4 కథనాలు


'రాధేశ్యామ్'.. సంచారి సాంగ్ టీజర్ రిలీజ్

రాధేశ్యామ్.. 'సంచారి' ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో రాధేశ్యామ్ కూడా ఒకటి. ఈసినిమా కూడా సంక్రాంతి పండుగ సందర్బంగా రిలీజ్ కానుంది. ఇకవింటేజ్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచానాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమా నుండి చలో చలో సంచారి అనే పాట టీజర్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. అనిరుధ్ రవిచందర్ ఆలపించిన ఈపాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించాడు. ఈపాటలో ప్రభాస్ స్టైలిష్ లుక్ తో అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఈపాట కూడా మంచి రెస్పాన్స్ తో వ్యూస్ తో దూసుకుపోతుంది.

'రాధేశ్యామ్'.. సంచారి సాంగ్ టీజర్ రిలీజ్
రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండగా ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, ప్రభాస్ టీజర్ యూట్యూబ్‌లో నయా రికార్డ్స్ సృష్టించాయి. ప్రమోషన్స్ లో భాగంగానే వరుసగా ఈసినిమా నుండి పాటలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు పాటలు రిలీజ్ చేయగా ఇప్పుడు మరో సాంగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా నుండి సంచారి పాట టీజర్ ను రిలీజ్ చేశారు. తెలుగులో 'సంచారి చలో చలో' అంటూ సాగే ఈ పాట హిందీలో 'ఉడ్…

'పుష్ప' సామ్ స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమా 'పుష్ప. ఇక ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే రోజుకో అప్ డేట్ ఇస్తూ సినిమాపై మంచి క్రేజ్ తీసుకొచ్చారు మేకర్స్. రిలీజ్ చేసిన పోస్టర్ల నుండి టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ప్రస్తుతం అయితే ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు చిత్రబృందం. దీనిలో భాగంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 12న హైదరాబాదు యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నారు.

'రాధేశ్యామ్'.. ఆకట్టుకుంటున్న 'నగుమోము' మెలోడీ సాంగ్
రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా రాధేశ్యామ్. యూరప్ నేపథ్యంలో పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్నఈసినిమాలో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా.. ప్రేరణ పాత్రలో పూజా నటిస్తుంది. మొత్తానికి చాలా గ్యాప్ తరువాత ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుండటంతో అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక జనవరి 14న ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో చిత్రయూనిట్ గట్టిగానే ప్రమోషన్స్ చేస్తుంది. దీనిలో భాగంగానే పాటలు ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే ‘ఈ రాతలే’ అంటూ రిలీజ్ అయిన పాట మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది.