
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో, దర్శకుడు సాగర్ కె. చంద్ర తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టైసన్ నాయుడు’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ పోలీస్ అధికారి పాత్రలో పవర్‌ఫుల్, మాస్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
యాక్షన్ సన్నివేశాలు, హై-వోల్టేజ్ ఎలిమెంట్స్‌తో టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.ఈ చిత్రంలో నేహా శెట్టి, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, నరేష్, రావు రమేష్, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి.ఇప్పటికే విడుదలైన ‘మదరాసి రబ్బరు బొమ్మ’ పాటకు మంచి స్పందన రాగా, తాజా టీజర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మాస్ యాక్షన్ అంశాలతో వస్తున్న ఈ చిత్రం విడుదల తేదీపై మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
వీడియోస్










