‘మేమ్ ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన యూత్‌ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘రోమాంచకం’ మూవీ అఫిషియల్ ట్రైలర్ విడుదల అయింది. అగ్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా వేణుగోపాల్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆధునిక కాలంలో ఉండే డేటింగ్ యాప్స్, నేటి యూత్ రిలేషన్‌షిప్స్ ఆధారంగా సాగే వినోదాత్మక కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు విడుదలైన ట్రైలర్ స్పష్టం చేస్తోంది. హీరో సుమంత్ ప్రభాస్ తనదైన తెలంగాణ యాసతో, మార్క్ కామెడీ అండ్ ఎనర్జిటిక్ టైమింగ్‌తో ఈ ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మొదట ఎంతో క్యూట్‌గా సాగే లవ్ స్టోరీ కాస్తా, ఆ తర్వాత అనూహ్య మలుపులు, ఇంటెన్స్ డ్రామాతో ఎలా థ్రిల్లింగ్‌గా మారిందో మేకర్స్ ఇందులో చూపించారు.
సుమంత్ ప్రభాస్ సరసన అనంతిక సనిల్‌కుమార్ కథానాయికగా నటించగా, వాసుకి వైభవ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రెజెన్సి ఉండటంతో ఈ సినిమాపై బాక్సాఫీస్ వద్ద మంచి హైప్ నెలకొంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ‘రోమాంచకం’ చిత్రం సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























