హిలేరియస్‌గా రంభ ఊర్వశి మేనక ట్రైలర్
Ramba Oorvasi Menaka Trailer Trailer Impresses with Hilarious Moments

అల్లరి నరేశ్ ప్రధాన పాత్రలో, సురభి కథానాయికగా తెరకెక్కుతున్న ఫాంటసీ కామెడీ చిత్రం 'రంభ ఊర్వశి మేనక' . ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఫాంటసీ మరియు హ్యూమర్ మేళవింపుతో రూపొందిన ఈ ట్రైలర్‌లో అల్లరి నరేశ్ తనదైన వినోదాత్మక టైమింగ్‌తో నవ్వించారు.
సాధారణ వ్యక్తి జీవితంలో దేవలోకానికి చెందిన రంభ, ఊర్వశి, మేనకలు ప్రవేశిస్తే జరిగే గందరగోళం, ఆ తర్వాత వచ్చే కామెడీ సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
చంద్రమోహన్ చింతడ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ ఫుల్ లెంత్ ఎంటర్‌టైనర్ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.నరేష్ స్ట్రాంగ్ జోన్ లో వస్తున్న ఈసినిమాపై అంచనాలు ట్రైలర్ తో పెరిగిపోయాయి. మరి ఈసినిమా నరేశ్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.







