మహాకాళి నుండి శుక్రాచార్యుడి వార్ క్రై గ్లింప్స్ విడుదల

Mahakali Unveils Shukracharya’s War Cry Glimpse

‘హను-మాన్’ సృష్టించిన గ్లోబల్ సెన్సేషన్ తర్వాత, ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ నుంచి రాబోతున్న మరో అత్యంత ప్రతిష్టాత్మక మైథలాజికల్ ఫాంటసీ చిత్రం ‘మహాకాళి’. ప్రశాంత్ వర్మ కథ అందించగా, పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ‘శుక్రాచార్యస్ వార్ క్రై పేరుతో పవర్ ఫుల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాక్షస గురువైన ‘శుక్రాచార్యుడి’ పాత్రలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా అసలు గుర్తుపట్టలేని విధంగా అత్యంత భయంకరమైన, పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపించారు. క్షీర సాగర మథనం సమయంలో దేవుళ్లంతా కలిసి అమృతాన్ని రాక్షసులకు దక్కకుండా చేశారనే ఆగ్రహంతో, “14 రోజుల్లో అసుర విజయ ఘోష సమస్త బ్రహ్మాండ దినమున ప్రతిధ్వనిస్తుంది” అని ఆయన చేసే ప్రతిజ్ఞ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ‘మహాకాళి’గా రౌద్ర రూపంలో శ్రియా రెడ్డితో పాటు భూమి శెట్టి, రోహిత్ సరాఫ్ ఈ విజువల్ వండర్‌లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఒక పసిబిడ్డను ఆలయంలో వదిలేయడం నుంచి ప్రారంభమయ్యే ఈ వీడియో, ధర్మానికి మరియు అధర్మానికి మధ్య జరిగే ఒక మహా యుద్ధాన్ని అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ మరియు దేవీ ఆరాధన నేపధ్యంతో ఆవిష్కరించింది.

ఈ విజువల్ వండర్‌ను ఆర్‌కేడీ స్టూడియోస్ పతాకంపై రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్నారు. “ది ఎండ్ బిగిన్స్” అంటూ 2027 సంక్రాంతి కానుకగా జనవరి 8న ) ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఈ గ్లింప్స్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.